HomeTelugu Trendingసింగర్‌ కేకే మరణంకి టాలీవుడ్‌ ప్రముఖుల నివాళి

సింగర్‌ కేకే మరణంకి టాలీవుడ్‌ ప్రముఖుల నివాళి

Tollywood celebrities mourn

ప్రముఖ సింగర్‌ కేకే హఠాన్మరణం యవత్‌ దేశంలోని సంగీతాభిమానులను, సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. ఆయన మృతిపై అన్ని పరిశ్రమలకు చెందిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియచేస్తూ నివాళులు అర్పిస్తున్నారు. తాజాగా ఆయన మృతి టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి సంతాపం తెలిపారు. ఆయన ట్వీట్‌ చేస్తూ.. ‘కేకే మరణ వార్త నన్ను ఎంతో దిగ్భ్రాంతికి గురి చేసింది. అద్భుతమైన గాయకుడు, గొప్ప వ్యక్తి. కేకే నా కోసం ‘ఇంద్ర’ లోని ‘దాయి దాయీ దామా’ పాట పాడారు. అతని కుటుంబానికి, సన్నిహితులకు, ప్రియమైన వారికి నా హృదయపూర్వక సానుభూతి. అతని ఆత్మకు శాంతి కలుగుగాక’ అంటూ చిరంజీవి నివాళులు అర్పించారు.

అలాగే మహేశ్‌ బాబు, రామ్‌ చరణ్‌ వంటి హీరోలు కేకే మృతికి సంతాపం తెలియజేశారు. ‘కేకే అకాల మరణం నన్ను షాక్‌కు గురిచేసింది. ఆయన ఒక గొప్ప గాయకుడు. అతని కుటుంబానికి, సన్నిహితులకు, ప్రియమైన వారికి నా హృదయపూర్వక సానుభూతి. అతని ఆత్మకు శాంతి కలుగుగాక’ అంటూ మహేశ్‌ సంతాపం ప్రకటించారు. అలాగే రామ్‌ చరణ్‌, పవన్‌ కల్యాణ్‌లు కూడా కేకే మృతి నివాళులు అర్పించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu