తెలంగాణలో భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన ప్రజలను ఆదుకోవడానికి పారిశ్రామికవేత్తలు, సినీ, వర్తక, వాణిజ్య ప్రముఖులు ముందుకు వస్తున్నారు. దాదాపు 32 వేలకు పైగా కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించామని నిన్న మంత్రి కేటీఆర్ ప్రకటించారు. నగరానికి జరిగిన పూర్తి నష్టాన్ని ఇంకా అంచనా వేయాల్సి ఉంది. మరోవైపు, వరద బాధితులను ఆదుకోవడానికి ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తెలంగాణకు ఆర్థికసాయం ప్రకటిస్తున్నాయి.
ఈ నేపధ్యంలో వరద బాధితులకు టాలీవుడ్ కూడా వారిని ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు చెరో కోటి రూపాయలను విరాళంగా ప్రకటించగా… అక్కినేని నాగార్జున రూ.50 లక్షలు, జూనియర్ ఎన్టీఆర్ రూ.50 లక్షలు, విజయ్ దేవరకొండ రూ.10 లక్షలు, దర్శకుడు హరీష్ శంకర్ ఐదు లక్షలు, అనిల్ రావిపుడి 5 లక్షల విరాళం ఇచ్చారు. హారిక హాసిని క్రియేషన్స్ -10 లక్షలు. కాగా ఇప్పటికే బాలకృష్ణ1.5 కోట్ల విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆపత్కాలం సమయంలో ప్రతి ఒక్కరూ తమకు వీలైనంత సాయం చేయాలని పిలుపునిచ్చారు.