వివాదాలకు దగ్గరగా ఉండే వర్మ టాలీవుడ్ ను కుదిపేస్తున్న డ్రగ్స్ వ్యవహారంపై తాజాగా స్పందించారు. మూడు రోజులు విచారణ తీరుని గమనించిన తరువాతే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టానని అన్నారు. ఓ చానెల్ లైవ్ కు వెళ్ళిన ఆయన ఎక్సైజ్ శాఖ వ్యవహరిస్తున్న తీరుని తప్పుబట్టారు. డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులను ప్రశ్నించింట్లుగానే విధ్యార్థులను కూడా ప్రశ్నించగలరా..? అంటూ విరుచుకు పడ్డారు. లీకులు అందించడం ద్వారా సెలబ్రిటీల వ్యక్తిగత జీవితానికి డ్యామేజీ కలిగిస్తున్నారని ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ పై ఆరోపణలు చేశారు. ఇది నా అభిప్రాయం అంటూ వివరణ ఇస్తూనే.. అకున్
సబర్వాల్ సమర్ధతను ఎవరు ప్రశ్నించలేరంటూ క్లారిటీ ఇచ్చాడు.
అయితే వర్మ మాట్లాడిన తీరు కరెక్ట్ కాదని, ఎక్సైజ్ శాఖ అధికారుల విచారణపై అభ్యంతరాలు వ్యక్తం చేయడం చట్ట ప్రకారం విరుద్దమని అధికారులు అంటున్నారు. ఈ మేరకు తాము పోలీసులకు పిర్యాదు చేస్తామని, వర్మ అరెస్ట్ తప్పదనీ వారంతా చెబుతున్నారు. దీనికి వర్మ తనదైన స్టయిల్ లో స్పందించారు. నాలుగు గోడల మధ్య విచారణ జరుగుతున్నప్పుడు ఆ విషయాలు ఎలా లీక్ అవుతున్నాయి..? లీక్ కానీ పక్షంలో వస్తోన్న ఊహాగానాలను ఖండించాల్సిన అవసరం అధికారులకు లేదా..? అభిప్రాయాలను చెబితేనే అరెస్ట్ చేస్తారా..? అంటూ వర్మ ప్రశ్నించారు.