HomeTelugu Big StoriesTollywood Actress: తెలుగులో అవమానం.. తమిళంలో సత్కారం

Tollywood Actress: తెలుగులో అవమానం.. తమిళంలో సత్కారం

Meenakshi Chaudhary Tollywood Actress,Meenakshi

Meenakshi Chaudhary: కొంతమంది హీరోయిన్స్ ని ఒక ఇండస్ట్రీ కాదు అంటే.. మరో ఇండస్ట్రీ మాత్రం నెట్టి పైన పెట్టుకున్న సందర్భాలు అంతెందుకు కత్రినా కైఫ్ ఐశ్వర్యారాయ్ ఇలాంటి హీరోయిన్స్ ని మన తెలుగువారు మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు.. కానీ ఈ హీరోయిన్స్ బాలీవుడ్ లో మాత్రం ఎంతటి స్టార్ స్టేటస్ కి ఎదిగారో మనందరికీ తెలిసిందే.

ఇప్పుడు ఇదే సీన్ మరో హీరోయిన్ కి రిపీట్ అయ్యేలా కనిపిస్తోంది. ఇచ్చుట వాహనములు నిలుపు రాదు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ మీనాక్షి చౌదరి. అయితే ఈ హీరోయిన్ కి ఆ సినిమా పెద్దగా విజయం అందించలేదు. ఆ తరువాత వచ్చిన.. ఖిలాడి సినిమా సైతం ఫ్లాప్ గా నిలిచింది. అయితే ఆ తరువాత అడివి శేషు హీరోగా వచ్చిన హిట్ సినిమా ఆమెకు కమర్షియల్ గా మంచి విజయం సాధించిపెట్టింది.Meenakshi Choudhary: ట్రెడిష‌న‌ల్ లుక్‌లో గుంటూరు కారం బ్యూటీ - అందాలు అద‌ర‌హో-meenakshi chaudhary latest photoshoot mahesh babu guntur karam thalapathy vijay the greatest of allatime ,ఫోటో న్యూస్

దాంతో ఈ హీరోయిన్ కి తెలుగులో ఎన్నో అవకాశాలు రావడం ప్రారంభమయ్యాయి.  ఇక త్రివిక్రమ్.. దర్శకత్వంలో మహేష్ బాబుతో మీనాక్షికి ఆఫర్ వచ్చింది అని తెలియగానే.. ఇక ఈ హీరోయిన్ దశ మారిపోయింది అనుకున్నారు అందరూ. కానీ అందరి ఆశలు తలకిందులు అయ్యాయి.

సినిమా విడుదలయ్యాక.. మీనాక్షి క్యారెక్టర్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. శ్రీ లీల హీరోయిన్ గా కనిపించిన ఈ చిత్రంలో మీనాక్షికి కనీసం సెకండ్ హీరోయిన్ అని చెప్పుకునే అంత క్యారెక్టర్ కూడా ఇవ్వలేదు.. మీనాక్షికి ఈ సినిమాలో కొంచెం కూడా ప్రాధాన్యత లేకుండా పోయింది. ఇంతకన్నా అవమానమా అంటూ.. ఆమె అభిమానులు అప్పట్లో బాధ పడసాగారు. అయితే మహేష్ బాబు సినిమాలో అవమానం ఎదురైనా.. ఆ చిత్రం ఫ్లాప్ అయిన కారణంగా.. మీనాక్షి పై ఎటువంటి ప్రభావం పడలేదు. దానికి తోడు ఇప్పుడు ఈ భామకు.. తమిళ ఇండస్ట్రీలో కాస్త వరస ఆఫర్లు వస్తున్నాయని వినికిడి.

తెలుగులో ఇప్పటికే రెండు భారీ సినిమాల్లో చాన్సులు అందుకున్న మీనాక్షి .. తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా దూసుకుపోతోంది. అక్కడ ఏకంగా దళపతి విజయ్ తో కూడా జత కడుతోంది.

తెలుగులో ఇంకా ఆమెకు స్టార్ క్రేజ్ రాకపోయినా.. గుంటూరు కారం సినిమాతో అన్ని ఇండస్ట్రీ వాళ్ళకి బాగా నోట్ అయింది ఈ హీరోయిన్. దీంతో ప్రస్తుతం వరస అవకాశాలు అందుకుంటుంది. ముఖ్యంగా తమిళంలో ఈ హీరోయిన్ కి ఏకంగా నాలుగు సినిమా చాన్సులు వచ్చినట్టు వినికిడి. ఈ నేపథ్యంలో ఈ హీరోయిన్ రెమ్యూనరేషన్ కూడా పెంచేసిందని వార్తలు వినిపిస్తున్నాను. మొత్తానికి మహేష్ సినిమాతో అవమానం చవిచూసిన మీనాక్షి చౌదరికి.. ప్రస్తుతం వరస అవకాశాలతో.. సత్కారం అందిస్తున్నారు సినీ నిర్మాతలు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu