HomeTelugu Trendingఓ ఇంటివాడు కాబోతున్న రానా.. ఆమె గురించి కొన్ని ఆసక్తికర అంశాలు

ఓ ఇంటివాడు కాబోతున్న రానా.. ఆమె గురించి కొన్ని ఆసక్తికర అంశాలు

9 9
టాలీవుడ్‌ హీరో రానా దగ్గుబాటి మంగళవారం ఓ పోస్ట్‌తో అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఓ అమ్మాయితో కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేసి.. ‘ఆమె ఓకే చెప్పింది’ అంటూ షాక్‌ ఇచ్చారు. ఆమె పేరు మిహీకా బజాజ్‌ అని తెలిపారు. ఈ ఫొటోకు తెగ కామెంట్లు, లైక్‌లు వచ్చాయి. అందరూ రానాకు శుభాకాంక్షలు చెప్పారు. కథానాయికలు సమంత, శ్రుతి హాసన్‌, హన్సిక, రాశీ ఖన్నా, కియారా అద్వాణీ శుభాకాంక్షలు చెప్పారు. ‘ఓమైగాడ్‌.. కంగ్రాట్స్‌’ అని రామ్‌ చరణ్‌ సతీమణి ఉపాసన కామెంట్‌ చేశారు. ‘మై మెన్‌.. శుభాకాంక్షలు.. ఎంగేజ్డ్‌ గ్యాంగ్‌లోకి నీకు స్వాగతం’ అని నిఖిల్‌ ట్వీట్‌ చేశారు. నితిన్‌ను కూడా ట్యాగ్‌ చేశారు. త్వరలోనే రానా పెళ్లి కుమారుడు కాబోతున్నట్లు తెలుస్తోంది. మిహీకా బజాజ్‌ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..

ఆమె ముంబయిలోని రచనా సంసాద్‌లో మిహీక ఇంటీరియర్‌ డిజైనింగ్‌లో డిప్లమా పూర్తి చేశారు. లండన్‌లోని చెల్సియా యూనివర్శిటీ ఆఫ్ ఆర్ట్ అండ్‌ డిజైన్‌లో ఎంఏ పూర్తి చేశారు. ‘డ్యూ డ్రాప్‌ స్టూడియో’ అనే ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీని నడుపుతున్నారు. ఆమెకు భారతీయ వాస్తుశిల్ప కళంటే ఇష్టమట. అందుకే ఈ వృత్తిని ఎంచుకున్నట్లు తెలిసింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లను బట్టి మిహీకలో రచయిత్రి కూడా ఉన్నట్లు తెలిసింది. ఆమె Pixie Dust పేరుతో బ్లాగ్‌ నడుపుతున్నారు. మహీక తల్లి బంటీ బజాజ్‌ జ్యువెలరీ డిజైనర్‌. Krsala అనే బ్రాండ్‌ను స్థాపించారు. ఆమె హైదరాబాద్‌లో నివసిస్తున్నారు.

ఆమె జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నాలజీ యూనివర్శిటీలో చదువుకున్నారు. 2018లో మిహీక ఈ మ్యాగజైన్‌ యు అండ్‌ ఐతో మాట్లాడారు. ఆ సందర్భంగా తన తల్లి తొలుత కార్యక్రమాలు, పెళ్లి వేడుకలు నిర్వహించేదని, ఆపై వివాహ అలంకరణ నిర్వహణలో భారతదేశంలో టాప్‌గా నిలిచారని అన్నారు. ‘మా అమ్మ వల్ల చిన్నతనం నుంచి అలంకరణ గురించి చూస్తున్నా. కాబట్టి నా సృజనాత్మకతను మెరుగు దిద్దుకోవడానికి దీనికి మించిన పని లేదు అనిపించింది. ఇప్పటికే తెలిసిన ఫీల్డ్‌ కావడంతో పనులు కూడా సులభంగా జరుగుతాయి’ అని మిహీక పేర్కొన్నారు. మిహీకకు సోదరుడు సమర్థ్‌ ఉన్నాడు. అతడు తన తల్లికి సంబంధించిన జ్యువెలరీ ప్రొడక్షన్‌ను చూసుకుంటుంటారట. తన సోదరుడు ముంబయిలో ఓ కొత్త సంస్థను ప్రారంభించబోతున్నాడని, అది అందరి దృష్టిని ఆకర్షిస్తుందని 2018లో ఆమె మ్యాగజైన్‌తో పేర్కొన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu