టాలీవుడ్ నటుడు, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీగా గుర్తింపు పొందిన కమెడియన్ పృథ్వీరాజ్ ఆసుపత్రి పాలయ్యాడు. ఆయన తొలిసారి దర్శకుడిగా మారి తెరకెక్కించిన చిత్రం ‘కొత్త రంగుల ప్రపంచం’. ఈ సినిమా ప్రమోషన్స్ లో అస్వస్థతకు గురై కుప్పకూలిపోయాడు పృథ్వీ. దీంతో ఆయన హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చేరి చికిత్స చేయించుకుంటున్నారు.
ఈ విషయం చెబుతూ ఆయన సోషల్ మీడియాలో వీడియో షేర్ చేశారు. అందులో బెడ్ పై పడుకున్న పృథ్వీ తన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. హాస్య నటుడిగా వందల చిత్రాల్లో నటించిన పృథ్వీ తన కూతురు శ్రీలును హీరోయిన్ గా పరిచయం చేస్తూ కొత్త రంగుల ప్రపంచం సినిమాను తెరకెక్కించారు.
విడుదలకు సిద్ధంగా వున్న ఈ చిత్రం ప్రమోషన్స్‌లో ఆయన బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన అస్వస్థతకు గురై కుప్పకూలిపోయారు. దీంతో కుటుంబసభ్యులు హుటాహుటిన సమీప ఆసుత్రికి తరలించారు. తాను కోలుకుంటున్నానని పృథ్వీ చెప్పారు. దర్శకుడిగా తొలి ప్రయత్నం చేశానని, ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ కూడా సినిమా గురించే ఆలోచిస్తున్నానని తెలిపారు. కొత్త రంగుల ప్రపంచం సినిమాకి అందరి ఆశీస్సులు కావాలని కోరారు.
ఆస్తికరంగా ‘బిచ్చగాడు 2’ ట్రైలర్
అనుష్క ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ టీజర్
సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్: భయం కలిగించే చాలా సన్నివేశాలు
బట్టలు లేకుండా హట్ లుక్‌లో విద్యాబాలన్
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు