టాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్‌హీరోగా ఓ వెలుగు వెలిగాడు జగపతిబాబు. ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్‌లో ఫుల్ జోషలో దూసుకుపోతున్నాడు. విలన్‌గా, కేరెక్టర్ ఆర్టిస్టుగా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు జగ్గుభాయ్. జగపతిబాబుకి హీరోగా కంటే విలన్ పాత్రలే ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చాయని పలు సందర్భాలలో ఈయన వెల్లడించారు.
ఇలా.. తన విలక్షణ నటనతో తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్రవేసిన జగ్గూభాయ్‌ను ఇప్పుడు హాలీవుడ్ కూడా పిలుస్తోంది.ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా స్వయంగా వెల్లడించారు. హాలీవుడ్ తనను పిలుస్తోందని, ఏమంటారని అభిమానులను అభిప్రాయం అడిగారు.
ఆయన ప్రశ్నకు నెటిజన్లు సరదాగా స్పందించారు. హాలీవుడ్‌ను కూడా దున్నేసి రావాలని కొందరంటే.. ఇంగ్లిష్ వాళ్లు మిమ్మల్ని తట్టుకోగలరా? అని ఇంకొందరు సరదాగా కామెంట్ చేశారు.