నిన్న మొన్నటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ పడిన బాధ మన పగవాడు కూడా పడకూడదు అనేటట్టు ఉండింది. పైకి చెప్పుకోలేకపోయిన.. తెలుగు సినిమాలో ప్రతి హీరో ఏదో ఒక విధంగా గత గవర్నమెంట్ తో చిక్కుల్లో ఇరుక్కున్న వాళ్లే ఉన్నారు. ముఖ్యంగా జగన్ గవర్నమెంట్తో ఎవరన్నా వివాదాలు పెంచుకుంటే.. వారి సినిమాకి టికెట్లు రేట్లు పెంచకుండా చేశారు.
అంతేకాకుండా ఎన్నో సినిమాలకు ఆంధ్రప్రదేశ్ లో ..బెనిఫిట్ షోలు టికెట్ హైక్లూ లేకుండా పోయాయి. ఇదే విషయంపై ఆఖరికి చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్లు సైతం..జగన్ నా కలిసిన లాభం లేకుండా పోయింది. దాంతో నిజంగా బ్లాక్ బస్టర్ సాధారించవలసిన కొన్ని సినిమాలు కూడా టికెట్ రేట్ ల వల్ల కేవలం హిట్ టాక్ తో సరి పెట్టుకున్నాయి.
ఈ క్రమంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొత్త గవర్నమెంట్ వచ్చిన సంగతి తెలిసిందే. టిడిపి, జనసేన, బిజెపి కూటమి నిన్న ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ లో ఘన విజయం సాధించింది. కాగా చంద్రబాబు నాయుడు సినిమా వారికి ఎప్పుడు అనుకూలంగానే ఉంటారు అన్నది అందరికీ తెలిసిన నిజం. మరోపక్క జనసేన పార్టీ లీడర్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ కి పవర్ స్టార్ కావడం మరో విశేషం.
మరి చంద్రబాబు… పవన్ కళ్యాణ్ పదవిలో ఉండగా టాలీవుడ్ ని ఆపేది ఎవరు అంటున్నారు అందరూ. వీరిద్దరూ తప్పకుండా టాలీవుడ్ సినిమాలకు ఎంతో సహాయకంగా ఉంటారని.. టికెట్ రేట్ ల విషయంలో అలానే బెనిఫిట్ షోలా విషయంలో అనుకూలంగా ప్రవర్తిస్తారు అని గట్టి నమ్మకంతో ఉన్నారు తెలుగు నిర్మాతలు.
మొత్తానికి నిన్నటి వరకు ఒక లెక్క.. ఈరోజు నుంచి ఒక లెక్క.. చంద్రబాబు ..పవన్ కళ్యాణ్ వచ్చారు.. ఇక టాలీవుడ్ రాట మారిపోయినట్టే అందు కామెంట్లు పెడుతున్నారు ఎంతోమంది నేటిజన్స్.