HomeTelugu Trendingమహేష్‌బాబుకు ఈరోజు చాలా ప్రత్యేకం

మహేష్‌బాబుకు ఈరోజు చాలా ప్రత్యేకం

1 19

టాలీవుడ్‌ సూపర్ స్టార్ మహేష్‌బాబుకు ఈరోజు ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే తన తల్లి ఇందిరా దేవి పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఇందిరాదేవి నటుడు కృష్ణ మొదటి భార్య అన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మహేష్‌బాబు తన తల్లికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. తల్లితో దిగిన ఫోటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఏప్రిల్‌ 20 నా జీవితంలో అత్యంత ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే ఈ రోజు అమ్మ పుట్టినరోజు. హ్యపీ బర్త్‌డే అమ్మ’’ అంటూ పోస్ట్ చేశారు. మహేష్‌ తల్లి ఇందిర బయట కనిపించడం చాలా అరుదు. కృష్ణకు మేన మరదలైన ఇందిరతో 1961లో వివాహం జరిగింది. కృష్ణ, ఇందిర దంపతులకు ఇద్దరు కొడుకులు ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమారుడు రమేష్ బాబు కొన్ని సినిమాల్లో హీరోగా నటించిన సంగతి తెలిసిందే. చిన్న కుమారుడు మహేష్‌బాబు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu