Upcoming Telugu Movies:
టాలీవుడ్ లో బోలెడు ఆసక్తికరమైన సినిమాలు విడుదలకి సిద్ధం అవుతున్నాయి. ప్రస్తుతం వర్కింగ్ టైటిల్స్ తో మాత్రమే పిలవబడుతున్న ఆ సినిమాలకు.. దర్శక నిర్మాతలు కొన్ని ఆసక్తికరమైన టైటిల్స్ అనుకుంటున్నారు. అందులో కొన్ని ఇప్పుడు చూద్దాం.
ఏజెంట్ తో మరొక ఫ్లాప్ అందుకున్న యంగ్ హీరో అక్కినేని అఖిల్.. ఇప్పుడు తన నెక్స్ట్ సినిమాతో బిజీ కాబోతున్నారు. ఆ సినిమాకి ధీర అనే టైటిల్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
చాలా రోజుల తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రెండు సినిమాలు చేస్తున్నారు. అందులో #BSS11 కి కిష్కిందపురి, #BSS12 కి హైందవ అనే టైటిల్స్ పెడుతున్నట్లు సమాచారం.
నందమూరి బాలకృష్ణ బాబీ దర్శకత్వంలో చేస్తున్న #NBK109 సినిమా కి వీరమాస్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిక్స్ అయినట్లు సమాచారం. నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన #NKR21 సినిమాకి మెరుపు అనే టైటిల్ ఫిక్స్ అయిందట.
కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టిఆర్.. చేస్తున్న సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ ఖరారు అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, హను రాఘవపూడి దర్శకత్వంలో.. ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. త్వరలో ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా మొదలు కాబోతోంది. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాలు పూర్తయ్యాక ఈ సినిమా పట్టాలెక్కనుంది. ఈ సినిమాకి ఫౌజీ అనే టైటిల్ అనుకుంటున్నట్లు సమాచారం. టైటిల్ కి తగ్గట్టుగానే ఈ సినిమాలో ప్రభాస్ ఒక సైనికుడి పాత్రలో కనిపించబోతున్నారట.
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న #RC16 మీద కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. విలేజ్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకి పెద్ది అనే డిఫరెంట్ టైటిల్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
Read more: Samantha Malayalam Debut: స్టార్ హీరో సినిమా నుండి సమంత సైడ్ అయిపోయిందా
మెగా హీరో సాయి ధరంతేజ్ కూడా ఈ మధ్యనే ఒక సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. #SDT18 అనే వర్కింగ్ టైటిల్ తో సిద్ధమవుతున్న ఈ సినిమాకి సంబరాలు ఏటిగట్టు అనే టైటిల్ ని అనుకుంటున్నట్లు సమాచారం. శర్వానంద్ హీరోగా నటిస్తున్న #శర్వా36 సినిమాకి రేస్ రాజా అనే టైటిల్ దాదాపు ఖరారు అయిపోయినట్లే అని తెలుస్తోంది.
మరోవైపు సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కూడా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. #వెంకీఅనిల్ 3 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంక్రాంతికి వస్తున్నాం.. అనే ఆసక్తికరమైన టైటిల్ ని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ కేవలం పుకార్లు మాత్రమే. వీటిలో నిజాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వెలువడాల్సిందే.