Tirumala Laddu Controversy:
ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ముఖ్యమైన పుణ్యక్షేత్రాలలో తిరుపతి మొదటి స్థానంలోనే ఉంటుంది. తిరుపతి వెంకటేశ్వర స్వామితో పాటే తిరుపతి లడ్డుకి కూడా దాదాపు 300 ఏళ్ల చరిత్ర ఉంది. అలాంటిది తిరుపతి లడ్డు కల్తీ అయింది అని.. అందులో జంతువుల ఫాట్ వాడుతున్నారు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే చంద్రబాబు నాయుడు చేసినవి కేవలం కామెంట్స్ మాత్రమే. అవి పచ్చి నిజాలు. అసలు విషయానికి వెళితే..
చాలా కాలం నుంచి తిరుపతి లడ్డు కోసం నెయ్యి అప్లై చేసేది కేఎంఎస్ నందిని అనే కంపెనీ వారు. కానీ మార్చ్ 2023 లో వేసిన టెండర్ లో.. తక్కువ ఖరీదు ఉంది అని ఆల్ఫా ఎల్ టు కంపెనీ వారికి.. ఈ టెండర్ ఇచ్చారు. వాళ్లు తిరుపతి లడ్డు కోసం కిలో నెయ్యి 424 రూపాయలకి సప్లై చేశారు.
అయితే ఆ సమయంలోనే తక్కువ ఖరీదుకి తీసుకుంటే క్వాలిటీ కూడా తగ్గుతుంది అంటూ నందిని వాళ్ళు ముందే హెచ్చరించారు. అయినా సరే అప్పుడు ఉన్న వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అవేమీ పట్టించుకోకుండా ఆల్ఫా వారికి టెండర్ ని ఇచ్చారు.
మన తిరుమలలో ఇంత తప్పు జరిగితే చూసి చూడనట్టు, పట్టి పట్టనట్టు ఎలా వదిలేస్తాం?
‘TIRUMALA LADDU’ CONTROVERSY!#telugutribune #Tirumala #Laddu #Hindu pic.twitter.com/OMenwZ75E6
— Telugu Tribune (@TeluguTribune) September 20, 2024
- 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత వైఎస్ఆర్సిపి ఘోర పరాజయం పాలైన సమయంలో.. టీటీడీ చైర్మన్ కూడా రిజైన్ చేశారు.
- ఆ తర్వాత శ్యామల రావు టీటీడీ చైర్మన్గా అపాయింట్ అయ్యారు. మీటింగ్ లో మాట్లాడుతూ తిరుపతి లడ్డు క్వాలిటీ ఎందుకు తగ్గింది అని అడగగా.. వాళ్ళు శనగపిండి, నెయ్యిలో క్వాలిటీ గురించి మాట్లాడారు.
- ఈ నేపథ్యంలో జులై 17వ తేదీన పాత లడ్డు శాంపిల్స్ ని టెస్టింగ్ కోసం పంపించారు. జులై 23వ తేదీన వచ్చిన రిపోర్ట్స్ చూసి అందరూ షాక్ అయ్యారు.
- తిరుపతి లడ్డుకి సప్లై చేస్తున్న నెయ్యిలో ఫిష్ ఆయిల్, బీఫ్ టాలో ఉన్నాయి అని రిపోర్ట్స్ లో తేలింది.
- దీంతో మళ్లీ కేఏంఎస్ నందిని వారిని ఘీ సప్లై చేయమని కోరారు. జూలై 28వ తేదీ నుంచి వాళ్ళు మళ్ళీ నెయ్యి సప్లై చేయడం మొదలుపెట్టారు.
- ఈ గందరగోళం మొత్తం వైఎస్ఆర్సిపి హయాంలోనే జరిగింది. అయితే ఈ విషయం అప్పటి ముఖ్యమంత్రి వైయస్ జగన్ కి తెలియకపోతే.. అది పూర్తి నిర్లక్ష్యం అని చెప్పుకోవచ్చు.
- ఒకవేళ జగన్ కి తెలిసినా కూడా ఏమి పట్టించుకోకుండా ఉన్నారు అంటే.. అంతకంటే దుర్మార్గం మరొకటి ఉండదేమో.
- క్రిస్టియన్స్ కి జెరూసలేం, ముస్లిమ్స్ కి మక్కా ఎలానో.. హిందువులకి తిరుపతి కూడా అంతే. అలాంటి ముఖ్యమైన పుణ్యక్షేత్రంలో.. ఇలాంటి తప్పులు జరగడం నిజంగా దుర్మార్గం.
Read More: AP New Liquor Policy గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు