HomeTelugu Newsబ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు

బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం ఉదయం రథోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. మేరుపర్వతం వంటి రథంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి వారు విశేషాలంకరణలతో ఆశీనులయ్యారు. భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ రథం పగ్గాలను లాగుతుండగా … తిరుమాడ వీధుల్లో రథోత్సవం సాగింది. వేలాది మంది భక్తులు తేరు పగ్గాలను పట్టుకొని రథాన్ని లాగారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు కర్పూర హారతులు సమర్పించారు. ముక్తి ఫలాన్ని భక్తులకు అందించే ఉత్సవమే బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజు జరిగే రథోత్సవం. వేంకటాచల సానువుల్లో కొలువైన శ్రీనివాస ప్రభువు రథంపై ఎక్కి ముందుకు సాగుతున్న వేళ భక్తులంతా గోవింద నామ స్మరణ చేస్తూ తన్మయులైనారు. ప్రతి భక్తుడూ స్వామి వారి రథాన్ని లాగడానికి అర్హుడే. “సర్వమానవాళి సమానమే” నన్న సమతా సిద్ధాంతాన్ని ఈ ఉత్సవం ప్రతిబింభిస్తుంది. అందుకే రథోత్సవం భక్తులకు కన్నుల పండుగ చేస్తుంది. శ్రీవారి వాహన సేవలు భక్తులకు పుణ్యాన్ని అందించడమే కాదు, జీవన మార్గాన్ని తీర్చిదిద్దుకునే జ్ఞానాన్నీ బోధిస్తుంది.

4 21

ఈరోజు రాత్రి జరిగే అశ్వవాహనంతో స్వామివారి వాహన సేవలు ముగియనున్నాయి. కలియుగదైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వైభవం వర్ణనాతీతం. ఏటా బ్రహ్మోత్సవాల్లో వివిధ వాహనాలపై అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు ఊరేగుతూ భక్తులకు కనువిందు చేస్తాడు. తనను ఆశ్రయించిన భక్తకోటికి వరద హస్తుడై అభయమిస్తాడు. రథాన్ని అధిరోహించిన కేశవుణ్ణి దర్శించుకుంటే మళ్లీ జన్మనెత్తాల్సిన అవసరమే లేదంటారు. ప్రతి మనిషీ జన్మజన్మల సాధనతో అందుకోవాల్సిన పారమార్థిక పీఠం రథంపై స్వామివారిని చూస్తేనే లభిస్తుందని నమ్ముతారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu