బీజేపీ, వైసీపీల మధ్య రహస్య ఎన్నికల ఒప్పందం నిజమేనని వైసీపీ విజయవాడ నగరశాఖ అధికార ప్రతినిధి మనోజ్ కొఠారి అంగీకరించారు. బీజేపీ పోటీ చేసే స్థానాల్లో తమ పార్టీ తరఫున బలహీన అభ్యర్థులను నిలబెట్టాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. టైమ్స్ నౌ ఆంగ్ల ఛానల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో కొఠారి తమ పార్టీ విధానాన్ని వెల్లడించారు. బుధవారం స్టింగ్ ఆపరేషన్ వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వీడియోలోని వివరాల ప్రకారం.. ‘మేం రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతిచ్చాం. ఆ తర్వాత పలు నిర్ణయాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని సమర్థించాం. మేం బీజేపీతోనే ఉన్నాం. 100శాతం మా మధ్య అవగాహన ఉంది. ఈ విషయంలో మా నేత విజయసాయిరెడ్డి తన పనిని సమర్థంగా చేస్తున్నారు. బుగ్గన రాజేంద్రనాథ్ బాగా చదువుకున్న వ్యక్తి. ఆయన నాన్సెన్స్ ఏమీ మాట్లాడరు. అవగాహన విషయంలో బుగ్గన కంటే విజయసాయిరెడ్డే ఎక్కువగా పని చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి, జగన్‌కు మధ్య బంధం బలపడటానికి చాలా చేశారు. బీజేపీకి కనీసం అభ్యర్థులు కూడా లేరు. అందుకే వారు పోటీచేసే కొన్ని స్థానాల్లోనైనా వైసీపీ తరఫున బలహీన అభ్యర్థులను నిలుపుతున్నాం. కన్నా లక్ష్మీనారాయణ ఉన్నారనుకోండి. ఆయన పోటీ చేసే స్థానంలో మా పార్టీ తరఫున బలహీన అభ్యర్థి పోటీలో ఉంటారు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయమే కాదు. పార్టీ విధానం కూడా.. జగన్ నేరుగా ఈ విషయం మాతో చెప్పరు. పెద్దిరెడ్డి లాంటి ఐదారుగురు నేతలు జగన్‌తో మాట్లాడతారు. వారే మాకు సమాచారం అందజేస్తారు. గత ఐదేళ్లుగా విజయసాయిరెడ్డే జగన్‌కు సలహాలిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే ఆయనే అధికారాన్ని నడిపిస్తారు’ అని ఆ వీడియోలో కొఠారి వెల్లడించారు.
HomeTelugu Newsబీజేపీ, వైసీపీ ఒప్పందం నిజమే!..స్టింగ్ ఆపరేషన్‌తో బయటపెట్టిన ఆంగ్ల ఛానల్ టైమ్స్ నౌ