Tillu Square : సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించిన తాజా చిత్రం ‘టిల్లు స్క్వేర్’. మల్లిక్ రామ్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా నిన్న (మార్చి 29)న విడుదలై పాజిటివ్ టాక్‌ని తెచ్చుకుంది. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది.
ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్స్ సినిమాపై భారీ హైప్‌ని క్రియేట్ చేశాయి. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై టిల్లు స్క్వేర్ సినిమా డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కింది. థియేట్రికల్ రైట్స్ భారీగా అమ్ముడుపోయాయి. ఏకంగా 27 కోట్లకు టిల్లు స్క్వేర్ థియేట్రికల్ బిజినెస్ జరిగినట్టు సమాచారం.
ఫస్ట్ షో నుంచి ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీ కలెక్షన్స్ కూడా ఊహించని విధంగా భారీగానే వస్తున్నాయి. తాజాగా టిల్లు స్క్వేర్ మొదటి రోజు కలెక్షన్స్‌ని అధికారికంగా ప్రకటించారు మూవీ యూనిట్. టిల్లు స్క్వేర్ సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 23.7 కోట్ల గ్రాస్ వసూలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది.
అమెరికాలో కూడా మొదటి రోజే 1 మిలియన్ డాలర్స్ పైగా కలెక్ట్ చేసింది. మీడియం రేంజ్ హీరోలకు కూడా ఈ రేంజ్ ఓపెనింగ్స్ ఇటీవల అరుదు అనే చెప్పాలి. సిద్ధూ టిల్లు స్క్వేర్ సినిమాతో అదరగొట్టేసాడు. ఈ వీకెండ్ నేడు, రేపట్లో ఈజీగా 50 కోట్లు దాటేస్తుందని, ఈజీగా బ్రేక్ ఈవెన్ అయిపోతుందని తెలుస్తుంది.
నిర్మాత నాగవంశీ నిన్న సక్సెస్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ టిల్లు స్క్వేర్ 100 కోట్లు కలెక్ట్ చేస్తుందని అన్నారు. తాజాగా వచ్చిన కలెక్షన్స్ చూస్తుంటే.. టిల్లు స్క్వేర్ ఈజీగానే 100 కోట్లు కొట్టేలా ఉంది.