Ravi Teja Mr Bachchan Teaser:
మాస్ మహారాజా రవితేజ.. హరీష్ శంకర్ కాంబినేషన్లో త్వరలో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న సినిమా మిస్టర్ బచ్చన్. పేరుకి హిందీలో అజయ్ దేవగన్ నటించి బ్లాక్ బస్టర్ అయిన రెయిడ్ సినిమాకి రీమేక్ అయినప్పటికీ.. హరీష్ శంకర్ కథకి తనదైన స్టైల్ లో మార్పులు చేర్పులు చేశారని చెప్పుకోవచ్చు.
ఈ సినిమా మీద అభిమానులకి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు మంచి ఆదరణ అందుకున్నాయి. చిత్ర టీజర్ కూడా సినిమా మీద అంచనాలు భారీగా పెంచింది. త్వరలో ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ విడుదల కాబోతోంది.
ఈ సినిమాలో యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ క్యామియో పాత్రలో కనిపించనున్నారు. రవితేజ తర్వాత ఎనర్జిటిక్ యంగ్ హీరోలలో సిద్దు జొన్నలగడ్డ పేరు ముందే ఉంటుంది. డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో సూపర్ సక్సెస్ లు అందుకున్న సిద్దు ఈ సినిమాలో ఎలాంటి పాత్రలో కనిపించనున్నారు అని సర్వత్ర ఆసక్తి నెలకొంది.
తాజా సమాచారం ప్రకారం సిద్దు జొన్నలగడ్డ ఈ సినిమాలో ఒక కీలక యాక్షన్ సీన్ లో వస్తారట. ఒక రెండు మూడు నిమిషాల పాటు సిద్దు తెరమీద కనిపిస్తారు. రవితేజ, సిద్దు జొన్నలగడ్డ ఇద్దరి ఎనర్జీ ఆ సీన్ కి హైలైట్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఆ సీన్ కి కచ్చితంగా ఈలలు పడతాయి అని అభిమానులు చెబుతున్నారు.
భాగ్యశ్రీ బోర్సే ఈ సినిమాలో హీరోయిన్ గా కనిపించనుంది. భారీ అంచనాల మధ్య ఆగస్టు 15న ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సినిమాతో రవితేజ ఖచ్చితంగా బౌన్స్ బ్యాక్ అవుతారు అని అభిమానులు ఆశిస్తున్నారు.