ఇప్పటికే పెళ్లికి ముందు కాబోయే భార్యాభర్తలకి ఒకరి గురించి ఒకరు ముందుగా తెలియాలనే ఒక కాన్సెప్ట్ తో పలు సినిమాలు వచ్చాయి. తాజాగా అత్త గురించి కోడలికీ .. కోడలి గురించి అత్తకి ముందుగా తెలియాలనే ఒక కొత్త కాన్సెప్ట్ తో రూపొందిన చిత్రం ‘LGM’. సాక్షి సింగ్ ధోని నిర్మించిన ఈ సినిమాకి, రమేశ్ తమిళమణి దర్శకత్వం వహించాడు.
ఇవాన – హరీశ్ కల్యాణ్ జంటగా నటించిన ఈ సినిమాను, ఈ నెల 28వ తేదీన తమిళంలో రిలీజ్ చేశారు. అదే రోజున తెలుగులోను విడుదల చేయాలని భావించారు. అయితే ‘బ్రో’ సినిమా కారణంగా వెనక్కి తగ్గారు. ఇప్పుడు ఈ సినిమాను ఆగస్టు 4వ తేదీన విడుదలత చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా నుంచి ‘టికి టికి టాటా’ అనే పాటను రిలీజ్ చేశారు.
కాబోయే అత్తా కోడళ్లుగా ఈ సినిమాలో నదియా – ఇవానా కనిపించనున్నారు. ఇద్దరి కాంబినేషన్ పై పబ్ లో చిత్రీకరించిన పాట ఇది. ఇక ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.