బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్, హీరోయిన్ దిశా పటానీ ఆరేళ్ల నుంచి ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా వీరు విడిపోయారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. వాళ్ల మధ్య ఏవో గొడవలు వచ్చాయని, ఇద్దరూ ఎవరి దారి వారు చూసుకుని బ్రేకప్ చెప్పుకున్నారంటూ ఓ వార్త బీటౌన్‌లో వైరల్‌గా మారింది.
ఇక దిశా పటానీ టైగర్ సోదరి క్రిష్ణ ష్రాఫ్ బెస్ట్ ఫ్రెండ్ కూడా! తరచూ వాళ్లింటికి కూడా వెళ్తూ అతడి కుటుంబంతోనూ చక్కగా కలిసిపోయేది. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. సోషల్ మీడియాలో మాత్రం ఒకరినొకరు ఫాలో అవుతూ వారి పోస్ట్‌లకు కామెంట్ చేశారు. కాగా ప్రస్తుతం ఇద్దరూ వారి వర్క్ మీద ఫోకస్ చేస్తున్నారు. టైగర్ ష్రాఫ్ స్క్రూ ఢీలా, గణపత్: పార్ట్ 1, బడేమియా చోటేమియా సినిమలతో బిజీ ఉన్నాడు. దిశా పటానీ.. ఏక్ విలన్ రిటర్న్స్, ప్రాజెక్ట్ కె, యోధ, కెటినా సినిమాలు చేస్తోంది. ఈ జంట విడిపోవడం వారి అభిమానులకు బాధను కలిగించే విషయమే.