మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ ‘టైగర్ నాగేశ్వర రావు’. 1970స్ కాలంలో స్టూవర్ట్‌పురంలో పాపులర్ దొంగగా పేరుపొందిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాతో వంశీ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే విడుదల నుండి విడుదలైన పోస్టర్లకు మంచి స్పందన వస్తుంది.
టైగర్ నాగేశ్వరరావు దండయాత్ర రేపు మధ్యాహ్నం 3 గంటలకు మొదలుకానుందని తెలియజేస్తూ.. రవితేజ చేతిలో గొడ్డలిని పట్టుకున్న లుక్ షేర్ చేశారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అనుపమ్ ఖేర్‌ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారి రాఘవేంద్ర రాజ్‌పుత్‌గా నటిస్తుండగా.. మురళీ శర్మ విశ్వనాథ శాస్త్రిగా నటిస్తున్నాడు.
తెలుగు, హిందీతోపాటు పలు భాషల్లో విడుదల చేసిన పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. ఈ చిత్రంతో బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్ సోదరి నుపుర్ సనన్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండగా.. గాయత్రి భరద్వాజ్ సెకండ్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో రేణూదేశాయ్ రీఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమాలో ఆమె హేమలత లవణం పాత్రలో నటిస్తోంది. అక్టోబర్ 20న ఈ సినిమాప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
INDIA’S BIGGEST THIEF IS READY TO BEGIN HIS HUNT 🔥🥷🏾
TIGER’S INVASION BEGINS TOMORROW AT 3.06 PM ❤️🔥#TigerNageswaraRao@RaviTeja_offl @DirVamsee @AbhishekOfficl @AnupamPKher #RenuDesai @NupurSanon @gaya3bh @Jisshusengupta @gvprakash @madhie1 @artkolla @SrikanthVissa… pic.twitter.com/snG68oLeFE
— Abhishek Agarwal Arts (@AAArtsOfficial) August 16, 2023