HomeTelugu TrendingSaripodhaa Sanivaaram: సైలెన్స్ చాలు.. ఇక వయోలెన్స్ షురూ

Saripodhaa Sanivaaram: సైలెన్స్ చాలు.. ఇక వయోలెన్స్ షురూ

Thumping response for Nani Saripodhaa SanivaaramTrailer
Thumping response for Nani Saripodhaa Sanivaaram Trailer

Saripodhaa Sanivaaram Trailer:

దసరా, హాయ్ నాన్న సినిమాలతో న్యాచురల్ స్టార్ నాని 2023లో రెండు బ్లాక్ బస్టర్లు అందుకున్నారు. ఈ మధ్యనే జరిగిన ఫిలింఫేర్ అవార్డులలో కూడా ఈ రెండు సినిమాలు బోలెడు అవార్డులు అందుకున్నాయి. దసరా సినిమాకి గాని నాని కూడా ఉత్తమ నటుడు అవార్డు గెలుచుకున్నారు. ఇక 2024 లో నాని హీరోగా విడుదలవుతున్న మొదటి సినిమా Saripodhaa Sanivaaram.

వివేక్ ఆత్రేయ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్లో 2022లో విడుదలైన అంటే సుందరానికి సినిమాకి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. మళ్లీ వీళ్ళిద్దరి కలయికలో సినిమా కాబట్టి సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి.

తాజాగా ఇవాళ ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ భారీ స్థాయిలో జరిగింది. సుదర్శన్ థియేటర్లో జరిగిన ఈవెంట్ కి భారీ స్థాయిలో వచ్చిన క్రౌడ్ చూసి ఫాన్స్ సైతం షాక్ అయ్యారు. నాని కి ఈ రేంజ్ లో క్రేజ్ ఉందని ఈవెంట్ చూసాకే అర్థమవుతుంది. ఈ సినిమా ఆగస్టు 29న విడుదల కాబోతోంది.

నిజానికి విడుదల కి ఇంకా కొద్దిరోజులు మాత్రమే సమయం ఉంది. కానీ చిత్ర బృందం మాత్రం ఇంకా ప్రమోషన్లు మొదలు పెట్టలేదు అని గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. సినిమా అసలు విడుదల అవుతుందా లేదా అని కూడా ప్రశ్నలు వచ్చాయి.

కానీ ఇప్పుడు అదిరిపోయే ట్రైలర్ కట్ తో చిత్ర బృందం సినిమాని భారీ స్థాయిలో ప్రమోట్ చేయడం మొదలుపెట్టింది. ఇక ఈ సినిమా ట్రైలర్ చూస్తేనే సినిమాలో బోలెడంత వైలెన్స్ ఉండబోతుందని.. నాని ఒక మంచి మాస్ పాత్రలో కనిపించనున్నారు అని తెలుస్తోంది.

నిన్న మొన్నటిదాకా చిత్ర బృందం సైలెంట్ గా ఉన్నప్పటికీ.. చిత్ర ట్రైలర్ తో ప్రమోషన్స్ ను భారీగానే మొదలుపెట్టింది.దీంతో సినిమా మీద అంచనాలు కూడా భారీగా పెరిగిపోయాయి. ఇక ఈ సినిమా ఎంతవరకు హిట్ అందుకుంటున్న వేచి చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu