పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా సినిమా వకీల్ సాబ్ ఇప్పటికే 70 శాతం పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ లాయర్‌గా కనిపించబోతున్నాడు. వేణుశ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు రేపు 3 బహుమతులను ప్లాన్ చేస్తున్నారట. వకీల్‌సాబ్ సినిమాతో పాటు మరో రెండు సినిమాలకు సంబంధించిన అప్‌డేట్ కూడా రాబోతుంది.
రాజకీయాల్లో బిజీ కారణంగా కొంత గ్యాప్ తీసుకున్న పవన్ కల్యాణ్ ఒకేసారి 3 సినిమాలు ప్రకటించారు. అయితే వీటికి సంబంధించిన అప్‌డేట్ రేపు విడుదల చేయబోతున్నారు. వకీల్ సాబ్ మూవీ నుంచి ఉదయం గం 9.09 నిమిషాలకు సర్‌ప్రైజ్ రాబోతున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. దీంతోపాటు పవన్-క్రిష్ కాంబినేషన్‌లో రూపొందనున్న సినిమా అప్డేట్ రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు ఇవ్వబోతున్నట్టు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇక మూడోది హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ అప్డేట్ సాయంత్రం 4.05 గంటలకు వెల్లడించబోతున్నారు. దీంతో పవన్ కల్యామ్ అభిమానులు ఎంతో ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు.