టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమాతో ఓటిటిలో మంచి హిట్ అందుకున్నాడు. తాజాగా సత్యదేవ్ హీరోగా మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా.. కన్నడంలో విజయం సాధించిన ‘లవ్ మాక్ టైల్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. ‘గుర్తుందా శీతాకాలం’ అనే టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కనుంది. నాగ శేఖర్ ఈ సినిమాకు దర్శకుడిగాను నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అయితే ఈసినిమాలో తమన్నా తో పాటు మరో ఇద్దరు భామలు కూడా నటిస్తున్నారని తెలుస్తుంది. నితిన్ నటించిన ‘లై’ ‘చల్ మోహన్ రంగ’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన మేఘా ఆకాష్ ఈ సినిమాలో ఓ హీరోయిన్ గా కనిపించనుందట. ఇక ఈ అమ్మడితో పాటు కన్నడ అందం కావ్య శెట్టి నిమరో హీరోయిన్ గా ఎంపిక చేశారని సమాచారం. త్వరలోనే ఈ వార్తలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాకు కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతాన్ని అందిస్తున్నాడు.