HomeTelugu Newsఏపీలో ప్రతి ఒక్కరికి 3 మాస్కులు ఉచితం

ఏపీలో ప్రతి ఒక్కరికి 3 మాస్కులు ఉచితం

14 6

కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఏపీ ప్రభుత్వం ఇవాళ ఓకీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఉన్న ప్రతీ ఒక్కరికీ 3 మాస్కుల చొప్పున పంపిణీ చేయాలని నిర్ణయించారు. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 16 కోట్ల మాస్కులు పంపిణీ చేయాలని ఆదేశించారు. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్నవారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. మాస్కుల వల్ల కొంత రక్షణ లభిస్తుందని అన్నారు. వీలైనంత త్వరగా మాస్కులను పంపిణీ చేయాలని ఆదేశించారు.. సోషల్ డిస్టెన్స్‌ తప్పనిసరిగా పాటించాల్సిందేనని.. రైతు బజార్లు, మార్కెట్లలో సర్కిల్స్ ఉండాలని మరోమారు సూచించారు. ప్రజలు ఎక్కడా గుమిగూడకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మూడోసారి సర్వే పూర్తిచేసినట్లు అధికారులు తెలిపారు. కరోనా కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో 45 వేల మందికి పరీక్షలు చేయబోతున్నట్లు సీఎం దృష్టికి తీసుకెళ్లారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu