తెలంగాణ హైకోర్టుకు ముగ్గురు అదనపు న్యాయమూర్తులను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ అన్నిరెడ్డి అభిషేక్‌రెడ్డి, జస్టిస్ కూనూరు లక్ష్మణ్ గౌడ్, జస్టిస్ తడకమళ్ల వినోద్ కుమార్ నియమితులయ్యారు.