రాఘవ లారెన్స్ హీరోగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా ప్రధాన పాత్రలో నటించిన భారీ బడ్జెట్ మూవీ ‘చంద్రముఖి 2’. స్టార్ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని సీనియర్ డైరెక్టర్ పి.వాసు రూపొందించారు. భారీ బడ్జెట్‌తో నిర్మితమైన ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. పాన్ ఇండియా మూవీగా సెప్టెంబర్ 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇప్పటి వరకూ ఈ సినిమా నుండి విడుదలైన అప్డేట్స్, టీజర్ ఈ సినిమాపై మంచి అంచనాలనే క్రియేట్ చేశాయి. తాజాగా చిత్రం నుంచి మూడో పాట ‘తొరి బొరి’ విడుదలైంది. ఈ పాటను భువనచంద్ర రాయగా.. అరుణ్ కౌండిన్య, అమల చెంబోలు ఆలపించారు. ఇక ఎం.ఎం. కీరవాణి బాగుంది.