
Telugu dubbing movie with 100 million views:
టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని తన నెక్ట్స్ ప్రాజెక్ట్ RAPO 22 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. మహేశ్ బాబు పి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో హీరోయిన్ భాగ్యశ్రీ బోర్స్. అయితే రామ్ తాజా చిత్రం డబుల్ ఇస్మార్ట్ హిందీ వెర్షన్ యూట్యూబ్‌లో సంచలన విజయం సాధించింది.
పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన డబుల్ ఇస్మార్ట్ ఆగస్టు 15, 2024న విడుదలై బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు. కానీ, హిందీ డబ్బింగ్ వెర్షన్ మాత్రం RKD స్టూడియోస్ యూట్యూబ్ ఛానల్లో 100 మిలియన్ వ్యూస్, 1 మిలియన్ లైక్స్ సాధించి సంచలనం సృష్టించింది.
ఈ సినిమాలో కావ్యా థాపర్ హీరోయిన్‌గా నటించగా, విలన్‌గా సంజయ్ దత్ మెరిశారు. బాని జె, అలీ, గెటప్ శ్రీను, సాయాజీ షిండే, మకరంద్ దేశ్‌పాండే, టెంపర్ వంశీ వంటి నటులు ఇందులో కీలక పాత్రలు పోషించారు.
మణిశర్మ సంగీతం సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అయ్యింది. చార్మీ కౌర్, పూరి జగన్నాథ్ కలిసి నిర్మించిన ఈ చిత్రం పూరి కనెక్ట్స్ బ్యానర్‌లో రూపొందింది.
గతంలో ఈ కాంబినేషన్‌లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ పెద్ద హిట్ కావడంతో డబుల్ ఇస్మార్ట్పై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమాకు బాక్సాఫీస్ వద్ద పరిమిత ఫలితం దక్కినా, హిందీ వెర్షన్ విజయంతో మళ్ళీ ఈ కాంబోపై ఆశలు పుట్టుకొస్తున్నాయి.
ALSO READ: Shah Rukh Khan మన్నత్ కారణంగా రూ.9 కోట్లు రీఫండ్ అందుకున్నారా?