
Most Violent Marco Movie:
Marco అనే మలయాళ సినిమా ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఈ చిత్రంలో అధిక స్థాయిలో హింస ఉందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) టీవీలో ప్రసారం చేయడాన్ని నిషేధించింది. ఇంకా, సినిమా ఓటీటీ విడుదలను కూడా అడ్డుకోవాలని సీబీఎఫ్‌సీ ప్రాంతీయ అధికారి నదీమ్ తుఫైల్ కేంద్రానికి లేఖ రాశారు.
మార్కో సినిమాలోని హింస భయానకంగా ఉందని చాలా మంది భావిస్తున్నారు. దీనిపై హీరో ఉన్ని ముకుందన్ మాట్లాడుతూ, “సమాజంలో ఉన్న హింసలో ఇది 10% కూడా చూపించలేదు” అంటూ స్పందించారు.
ఇటీవల తెలుగు నటుడు కిరణ్ అబ్బవరం ఈ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ, “నేను ‘మార్కో’ సినిమాకు నా భార్యతో వెళ్లాను. సినిమా రెండో భాగంలో హింస తీవ్రంగా ఉండటంతో మేమిద్దరం మధ్యలోనే బయటకు వచ్చేశాం. ఆమె గర్భవతి కావడంతో ఆ రక్తపాతాన్ని మేము తట్టుకోలేకపోయాం. ప్రీ-క్లైమాక్స్‌కు ముందే థియేటర్‌ను వదిలేశాం” అని చెప్పారు.
‘మార్కో’ చిత్రాన్ని మలయాళ సినిమాల్లో అత్యంత హింసాత్మక చిత్రంగా ప్రమోట్ చేశారు. దీని కారణంగా సినిమాకు భారీ క్రేజ్ ఏర్పడింది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం 100 కోట్ల రూపాయలకుపైగా గ్రాస్ కలెక్షన్‌తో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అయితే ఓటీటీ విడుదల తర్వాత సినిమాపై మిశ్రమ స్పందన వచ్చింది.
హనీఫ్ అదేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో యుక్తి తరేజా కథానాయికగా నటించారు.
ALSO READ: Summer 2025 Telugu movie releases: ఈ సారి చిన్న సినిమాల హవా మామూలుగా లేదుగా