
Highest tax paying heroine 2024:
మామూలుగా సినిమా ఇండస్ట్రీ అనగానే హీరోయిన్ ల కంటే.. హీరోలు ఎక్కువగా సంపాదిస్తారని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ, గత కొంతకాలంగా మహిళా సూపర్‌స్టార్లు కూడా అదే రేంజ్‌లో డిమాండ్ చేస్తూ కోట్లలో సంపాదిస్తున్నారు.
తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం, ఒక బాలీవుడ్ బ్యూటీ అందరినీ దాటేసి 2024 సంవత్సరానికి భారీ పన్ను చెల్లించి Highest tax paying heroine గా నిలిచింది. ఆమె మరెవరో కాదు కరీనా కపూర్. ఈ ఏడాది ఆమె 20 కోట్ల రూపయలను ఆదాయపు పన్ను చెల్లించారు.
కరీనా కపూర్ సినిమాలు, ప్రకటనలు, వ్యాపారాలు, ఇలా భారీ ఆదాయాన్ని అందుకుంటున్నారు. గత కొద్ది రోజులుగా అప్పుడొక సినిమా ఇప్పుడొక సినిమా మాత్రమే చేస్తున్నారు కానీ మిగతా ఆదాయపు వనరుల నుండి ఈమె బాగానే వెనకేసినట్టు తెలుస్తోంది. ఆమె కట్టిన ఆదాయపు పన్ను దానికి ఉదాహరణ.
ఇక కరీనా తరువాత ఈ జాబితాలో ఉన్నది మరో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ. కియారా 2024 ఆర్థిక సంవత్సరానికి 12 కోట్లు పన్ను చెల్లించి రెండవ స్థానంలో నిలిచారు. ఇప్పుడు కియారా, రామ్ చరణ్‌తో చేసిన గేమ్ ఛేంజర్ వంటి పెద్ద సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈమె కూడా సినిమాలకు భారీ పారితోషికం అందుకుంటోంది.
కియార అంటే ఫామ్ లో ఉన్న హీరోయిన్ కాబట్టి భారీ పన్ను చెల్లించడంలో పెద్దగా షాక్ అవ్వాల్సిన విషయం ఏమి లేదు. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ భారీ పే చెక్స్ అందుకుంటూ ఉంటుంది ఈ భామ. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. కరీనా కపూర్ తన పీక్ దశ దాటేశారు కానీ.. ఇప్పటికీ భారీగా సంపాదిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు.












