
600 Cr movie rejected by Salman Khan:
ఇండియన్ సినిమా ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అట్లీ – అల్లు అర్జున్ కాంబినేషన్ సినిమా కన్ఫర్మ్ అయ్యింది. పీపింగ్‌మూన్ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మించనున్న భారీ బడ్జెట్ చిత్రానికి ఓకే చెప్పారు. ఈ ప్రాజెక్ట్ ‘పుష్ప 2’ తరువాత అల్లు అర్జున్ చేసే మూవీగా ఖరారైంది.
ఇది భారీ పీరియడ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది. రీఇంకార్నేషన్ (పునర్జన్మ) నేపథ్యంలో అద్భుతమైన విజువల్స్‌తో ఈ సినిమా తెరకెక్కనుందని టాక్. ఇది రెండు హీరోల కథ అని, కానీ రెండో హీరోగా ఎవరు నటించబోతున్నారనే విషయాన్ని ఇంకా వెల్లడించలేదు. అయితే ఇందులో ముగ్గురు లీడ్ హీరోయిన్లు ఉండబోతున్నారని, జాన్వీ కపూర్ ఒక పాత్రకు పరిశీలనలో ఉన్నారని సమాచారం.
ఈ సినిమాకు 600 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టే అవకాశం ఉంది. తొలుత సల్మాన్ ఖాన్‌తో ఈ ప్రాజెక్ట్ ప్లాన్ చేసినా, కమర్షియల్‌గా ఆయనకు అంత స్థాయిలో బజ్ లేదని సన్ పిక్చర్స్ వెనుకడుగేసింది. దీంతో ప్రాజెక్ట్ మళ్లీ అల్లు అర్జున్ దగ్గరికి వచ్చిందని టాక్.
అల్లు అర్జున్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో మిథలాజికల్ మూవీ ప్లాన్ అయ్యింది. కానీ స్క్రిప్ట్ వర్క్ ఇంకా కొనసాగుతుండటంతో 2026కి పోస్ట్‌పోన్ చేశారు. దీంతో అట్లీ మూవీకి ప్రాధాన్యం ఇచ్చారు. ఈ సినిమా 2025 ప్రారంభం కానుండగా, 2026 మొదటి త్రైమాసికానికల్లా పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.