HomeTelugu Trending'బావ అల్లు అర్జున్‌కి ప్రేమతో ఓ చిరు కానుక'

‘బావ అల్లు అర్జున్‌కి ప్రేమతో ఓ చిరు కానుక’

11 17స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌ కోసం నటుడు నవదీప్‌ ఓ ప్రత్యేక కానుకను సిద్ధం చేయించారు. ‘రుద్రమదేవి’ సినిమాలో బన్నీ ‘గోనగన్నా రెడ్డి’ పాత్రలో సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బన్నీ ‘గమ్మునుండవోయ్..’ అంటూ చెప్పిన డైలాగ్‌లు, హావభావాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో బన్నీ లుక్‌లో ఉన్న చిన్న విగ్రహాన్ని నవదీప్‌ తయారు చేయించారు. దీన్ని తన స్నేహితుడు, బావ బన్నీకి ఇవ్వబోతున్నట్లు సోషల్‌మీడియాలో పేర్కొన్నారు. ‘బావకి ప్రేమతో ఓ చిరు కానుక’ అని నవ్వుతూ అల్లు అర్జున్‌ను ట్యాగ్‌ చేశారు. ఈ సందర్భంగా ఓ వీడియోను కూడా షేర్‌ చేశారు.

బన్నీ, నవదీప్‌ కలిసి ‘ఆర్య 2’ సినిమాలో నటించారు. ఇందులో వీరిద్దరు స్నేహితుల పాత్రల్ని పోషించారు. సుకుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా మంచి విజయం అందుకుంది. అప్పటి నుంచే బన్నీ, నవదీప్‌ స్నేహితులు. ఇటీవల నవదీప్‌ స్థాపించిన ఓ సంస్థను అల్లు అర్జున్‌ సందర్శించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu