Biggest Disaster in 2024:
అజయ్ దేవగణ్ నటించిన ‘మైదాన్’ సినిమా, భారతీయ ఫుట్‌బాల్ స్వర్ణ యుగానికి కీర్తి తెచ్చిన సయ్యద్ అబ్దుల్ రహీం జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. ఎమోషనల్ కథ, అద్భుతమైన నటనతో ఈ సినిమా విజయం సాధిస్తుందని ఆశించారు. కానీ ఇది 2024లో అత్యంత Biggest Disaster గా నిలిచింది.
రూ. 250 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా భారతదేశంలో కేవలం రూ. 54 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ. 71 కోట్లు మాత్రమే సంపాదించింది. పాజిటివ్ రివ్యూలు వచ్చాయి కానీ.. ఈ సినిమా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో విఫలమైంది.
View this post on Instagram
నిర్మాత బోనీ కపూర్ ఈ ఫలితంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రైవేట్ స్క్రీనింగ్స్ సమయంలో సినిమా రెండో భాగం ప్రేక్షకులను కట్టిపడేసిందని ఆయన తెలిపారు. అయినప్పటికీ, సినిమాకి ఆశించిన స్పందన రాలేదు.
ఈ సినిమా విడుదల సమయంలో అక్షయ్ కుమార్ నటించిన ‘బడే మియాన్ చిన్నే మియాన్’తో తీవ్రమైన పోటీ ఎదుర్కొంది. అంతర్జాతీయంగా మరింత బలహీన ప్రదర్శనతో కేవలం రూ. 8 కోట్లు మాత్రమే వసూలు చేసింది.
ఇటీవల సంవత్సరాలలో అజయ్ దేవగణ్ వరుసగా మూడు బాక్సాఫీస్ ఫెయిల్యూర్స్ చవిచూశారు. అయినప్పటికీ, ఈ సినిమా భారతీయ ఫుట్‌బాల్‌కు చేసిన సయ్యద్ అబ్దుల్ రహీం గారి కృషికి గౌరవంగా నిలుస్తుంది అని మాత్రం చెప్పుకోవచ్చు.
ALSO READ: 200 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్న Most Expensive Villain ఎవరంటే!