Homeతెలుగు వెర్షన్ఆంధ్రలో అత్యంత నష్టపోయిన జిల్లా ఇదే !

ఆంధ్రలో అత్యంత నష్టపోయిన జిల్లా ఇదే !

This is the worst district in Andhra

ఆంధ్రప్రదేశ్‌ జిల్లాల పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన జిల్లాల గురించి ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. జగన్ రెడ్డి తన పార్టీకి తన మనుషులకు లాభం కూర్చేలా జిల్లాలను ఏర్పాటు చేసుకున్నాడు అని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే, ఆంధ్రప్రదేశ్‌ జిల్లాల పునర్వ్యవస్థీకరణలో అత్యంత నష్టపోయిన జిల్లా ఏది? ఎందుకు? అని తాజాగా ఆంధ్రలో ఓ చర్చ మొదలయ్యింది. అసలు అత్యంత నష్టపోయిన జిల్లా ఏది అంటే.. అల్లూరి సీతారామరాజు జిల్లాకు ఎక్కువ నష్టం వాటిల్లింది. అంత్యంత నష్టపోయిన జిల్లా అని చెప్పడం అంత సముచితం కాదేమో. ఎందుకంటే భౌగోళిక పరిస్థితులను ఎవరూ మార్చలేరు. కానీ ప్రస్తావించక తప్పదు. ఇక నష్టపోయింది మాత్రం రంపచోడవరం రెవెన్యూ డివిషన్ ప్రజలు. పెద్ద జిల్లా అయినందున జిల్లా కేంద్రం పాడేరుకు చేరుకోవడం చాలా ఇబ్బంది పెట్టే విషయం.

పోలవరం ముంపు మండలాలు నుండి పాడేరుకు చేరుకోవాలంటే దాదాపు 350 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుంది. జిల్లాలో అంతర్గత రోడ్డు మార్గం లేదు. కొండల్లో ఏర్పరుచుకున్న త్రోవలే దారి. రంపచోడవరం నుండి జిల్లా కేంద్రమైన పాడేరు వెళ్లాలంటే ఘాట్ రోడ్డులో నర్సీపట్నం చేరుకుని అక్కడి నుండి పాడేరు వెళ్ళాలి. ఇటువంటి ప్రాంతంలో అధికారుల పర్యవేక్షణ కూడా కష్టమే. ప్రభుత్వ ఉద్యోగులు ఆ ప్రాంతం వారైతేనే తప్ప మిగతా ఉద్యోగులెవ్వరూ ఇక్కడికి రావడానికి సుముఖత చూపరు. వచ్చినా సరే వారందరికీ విద్యా, వైద్య సదుపాయాలు, ఉండడానికి క్వార్టర్స్ ను కొత్తగా నిర్మించుకోవాలి. మౌలిక సదుపాయాల ఉన్న ఊరు ఒక్కటి కూడా లేదు. అన్నీ అంతంత మాత్రమే.

ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ రెడ్డి ఈ ప్రాంతానికి సదుపాయాల కోసం నిధులు కేటాయిస్తాడు అని అనుకోవడం అవివేకం. ఏదో అరకొర నిధులిచ్చి సరిపెట్టడం తప్ప.. జగన్ రెడ్డి ఈ జిల్లాకి చేసింది ఏమీ లేదు. మొత్తానికి ఈ అల్లూరి సీతారామరాజు జిల్లాకు ఏది సరిగ్గా లేదు. మరీ ముఖ్యంగా రంపచోడవరం డివిజన్ కు ఎక్కువ నష్టం జరిగింది. ఈ జిల్లాను రెండుగా విభజించి రంపచోడవరం డివిజన్ ను ప్రత్యేక జిల్లా చేసి, మునుపు ఉన్న ఎటపాక రెవెన్యూ డివిజన్ ను యధాతధంగా కొనసాగిస్తే ఇంకా మెరుగ్గా ఉంటుంది. ఇన్నాళ్లు పాడేరుకు, రంపచోడవరానికి ఏ సంబంధమూ లేదు. రెండూ ఏజెన్సీ ప్రాంతాల కిందకే వస్తాయి. ఇన్నాళ్లు ఎవరైనా రంపచోడవరం వెళ్లాలంటే రాజమండ్రి, జగ్గంపేట దగ్గర మలుపు తిప్పేసేవారు. అంతర్గతంగా ఉన్న ఘాట్ రోడ్డులో ప్రయాణం చాలా తక్కువ. రాత్రుళ్ళు ప్రవేశం ఉండదు. ఇన్నాళ్లు ఏ సంబంధం లేని వాటిని ఇప్పుడు కలుపుతున్నారు. కేవలం ఈ రెండు ప్రాంతాలు ఏజెన్సీ అనే ఒకే ఒక్క కారణంతో. రంపచోడవరం నుండి పాడేరు వెళ్లాలంటే రెండు బస్సులు మారాలి.

అలాగే మరో విషయం గురించి చెప్పాలి, ఒక నియోజకవర్గంలోని అన్ని మండలాలు ఒకే జిల్లాలో ఉండాలి అనే ఒక నియమం ఇప్పుడు ఈ అల్లూరి సీతారామరాజు జిల్లాను ఇబ్బంది పెట్టింది. మరి వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలిచాక అయినా సరే.. ఈ జిల్లా బాగు కోసం చంద్రబాబు సరికొత్త ప్రణాళిక ఏమైనా చేస్తారేమో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu