తానే ఘనాపాటి నాయకుడు అంటూ ఇన్నాళ్లు బిల్డప్ లు పోయిన జగన్మోహన్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఓటములతో ఎండమావిగా మారిన టీడీపీకి మళ్లీ పునరుజ్జీవం కలిగింది. ఆంధ్రప్రదేశ్‌లో మూడు పట్టభద్రుల, రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో రెండు ఉపాధ్యాయ స్థానాల్లో వైసీపీ మద్దతుదారులు గెలుపొందారు. కాదు, తూర్పు, పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ స్థానాల్లో గెలిచిన పి.చంద్రశేఖరరెడ్డి, రామచంద్రారెడ్డి లను జగన్ రెడ్డి నయానో భయానో తన వైపుకు తిప్పుకున్నాడు. దాంతో, రెండు ఉపాధ్యాయ స్థానాల్లో గెలిచాం అనిపించుకుని వైసీపీ తన పరువు కాపాడుకునే ప్రయత్నం చేసింది. కానీ, జగన్ రెడ్డిని ప్రజలు ఛీ కొట్టారు అనే విషయం మాత్రం అందరికీ తెలిసిపోయింది.
ముఖ్యంగా పట్టభద్రుల పోరులో జగన్ రెడ్డి పార్టీ పూర్తిగా తేలిపోయింది. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ పట్టభద్రుల స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు వేపాడ చిరంజీవిరావు, కంచర్ల శ్రీకాంత్ గెలిచారు. వీరి గెలుపు దిశగా ప్రయాణిస్తున్నారని తెలియగానే.. కూలీ మీడియా ఈ ఎన్నికల పై నెగిటివ్ ప్రచారం మొదలు పెట్టింది.కానీ, ప్రజలకు నిజాలు తెలిసిపోయాయి. మొదటి నుంచి టీడీపీ, వైసీపీ మధ్య పోరు హోరాహోరీని తలపించింది అని అంటున్నారు గానీ, అసలు ఎక్కడా హోరాహోరీ పోరు లేదు.
జగన్ రెడ్డి పై తీవ్ర వ్యతిరేకంగా ఉన్న పట్టభద్రులు అందరూ.. ఎలాగైనా తమ కసిని తీర్చుకోవాలని అనుకున్నారు. అలాగే తీర్చుకున్నారు కూడా. అసలు జగన్ రెడ్డి ఫేక్ ఓట్లు వేయించకపోతే.. పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. మరోవైపు ఈ ఎన్నికల్లో గెలుపొందుతామని టీడీపీ పార్టీ, ఆ పార్టీ నాయకులు చాలా ధీమాగా ఉన్నారు. అందుకే, పెద్దగా గెలుపు కోసం కష్టపడలేదు. అసలు మూడు పట్టభద్రుల స్థానాల్లో స్పష్టంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యతిరేకత కనిపించింది.
ఈ వ్యతిరేకత అయినా జగన్ రెడ్డి ఒప్పుకుంటాడా ?, లేక, చంద్రబాబు మాయ చేసి గెలిచాడు అని ఎప్పటిలాగే సోది చెబుతాడా ?, జగన్ రెడ్డి ఇప్పటికైనా అధికారం శాశ్వతం కాదు అనే విషయాన్ని కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. ఇప్పటికే, గత నాలుగేళ్లలో తమను పట్టించుకోలేదని వైసీపీ గ్రామ, మండల నాయకులు, కార్యకర్తలు జగన్ రెడ్డి పై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు.
ఈ సారి జరిగే సాధారణ ఎన్నికల్లో కూడా వైసీపీ అధిష్టానానికి బుద్ధి చెప్పాలని ఆ పార్టీ వారే పట్టుదల, కసితో ఉన్నారు అంటే.. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. జగన్ పై వ్యతిరేకత తాజా ఎన్నికల ఫలితాలు చెప్పాయి. మరి జగన్ రెడ్డికి ఇప్పటికైనా జ్ఞానోదయం కావాలి. లేదంటే అసలుకే ఎసరు వస్తుంది. అయినా ఎసరు వస్తేనే ఆంధ్ర బాగు పడుతుంది లేండి. ఏది అయితే ఏం.. జగన్ రెడ్డి పతనానికి ఇది పునాది.