HomeTelugu Big StoriesBigg Boss 8 Telugu నుండి ఈవారం ఎలిమినేట్ అవ్వబోతున్న కంటెస్టెంట్ ఎవరో తెలుసా?

Bigg Boss 8 Telugu నుండి ఈవారం ఎలిమినేట్ అవ్వబోతున్న కంటెస్టెంట్ ఎవరో తెలుసా?

This contestant to get eliminated from Bigg Boss 8 Telugu this week
This contestant to get eliminated from Bigg Boss 8 Telugu this week

Bigg Boss 8 Telugu Elimination:

Bigg Boss 8 Telugu నాలుగో వారం నామినేషన్ ఉత్కంఠగా సాగిన సంగతి తెలిసిందే. ఈ వారం ఎలిమినేషన్‌కు నామినేట్ అయిన కంటెస్టెంట్లు నబీల్ అఫ్రిది, ఆదిత్య ఓం, నాగ మణికంట, ప్రేరణ, సోనియా ఆకుల, పృథ్విరాజ్ ఉన్నారు. వీరిలో ఎవరు బయటకు వెళ్ళిపోతారన్నదే ముఖ్య ప్రశ్నగా మారింది.

ఓటింగ్ లైన్స్ తెరిచిన తర్వాత వచ్చిన సర్వేలు, సోషల్ మీడియాలోని పోల్స్ ఆధారంగా సోనియా ఆకుల, పృథ్విరాజ్ ఈ వారం తక్కువ ఓట్లు అందుకున్నారు. అయితే, సోనియా ఆకుల తక్కువ ఓట్లు సాధించినప్పటికీ.. ఈ వారం ఆమె ఎలిమినేట్ అవ్వటం లేదు అని కొందరు అంటున్నారు. షో మేకర్స్ నుండి సోనియాకు బలమైన మద్దతు ఉంది అని.. ఆమె ఈ వారం సేఫ్‌గా బయటపడే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.

అంతే కాకుండా.. సోనియా ఆకుల ఈ వారం మాత్రమే కాకుండా, టాప్ 5 ఫైనలిస్టుల్లో ఒకరుగా నిలుస్తారనే అంచనాలు ఉన్నాయి. ఈ విషయం పక్కన పెట్టేస్తే.. షో మేకర్స్ సోనియాను కాపాడేందుకు మరొకరిని ఎలిమినేట్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ సారి కంటెస్టెంట్ పృథ్విరాజ్ ఎలిమినేట్ అవ్వనున్నారనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. పృథ్విరాజ్ షోలో అందిస్తున్న కంటెంట్ చాలా తక్కువగా ఉందని, ఇతర కంటెస్టెంట్లతో పోలిస్తే అతని పెర్ఫార్మెన్స్ సరిగ్గా లేదని కొందరు భావిస్తున్నారు. అందుకే పృథ్విరాజ్ ఈ వారం బయటకు వెళ్ళే అవకాశం ఉందని అభిప్రాయాలు వెలువడుతున్నాయి.

అయితే, ఎలిమినేషన్ అధికారికంగా ప్రకటించే వరకు ఏదీ ఖచ్చితంగా చెప్పలేము. కానీ, ప్రేక్షకులు ఈ వారం ఎలిమినేషన్ రోజు కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read More: Bigg Boss 8 Telugu నబీల్ అఫ్రిది రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Recent Articles English

Gallery

Recent Articles Telugu