Bigg Boss 8 Telugu elimination:
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఫైనల్ దశకు చేరుకుంది. మరో రెండు వారాల్లో, డిసెంబర్ 15న, గ్రాండ్ ఫినాలే జరగనుంది. షో చివరి దశకు చేరుకోవడంతో అభిమానుల్లో ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంది. ముందుగా వచ్చిన వార్తలు షో పొడిగింపుపై ఆసక్తికరంగా అనిపించింది కానీ, ఇప్పుడు షో సమయానికి ముగుస్తుందని నిర్ధారణ అయ్యింది.
గత వారం షోలో అందరికీ షాక్ ఇచ్చేలా టేస్టీ తేజ, పృథ్వి డబుల్ ఎలిమినేషన్ జరిగింది. ఈ వారం ఆరుగురు హౌస్‌మేట్స్ నామినేట్ అయ్యారు:
1. నిఖిల్
2. గౌతమ్
3. ప్రేరణ
4. నబీల్ అఫ్రిది
5. విష్ణు ప్రియ
6. రోహిణి
ఈ వారం అవినాష్ మాత్రమే సేఫ్‌గా ఉన్నాడు. మిగతా నామినేట్ అయిన కంటెస్టెంట్లు ఫైనల్‌లోకి ప్రవేశించడానికి తీవ్రంగా పోరాడుతున్నారు.
ఈ వారం నామినేషన్‌లో రోహిణి పేరు కనిపించడం షాకింగ్‌గా మారింది. హౌస్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా నిలిచినా, మొదటిసారి నామినేషన్‌కు వచ్చింది. అయితే సోషల్ మీడియాలో చర్చలు, ప్రేక్షకుల ఓటింగ్‌ను గమనిస్తే, రోహిణి ఎలిమినేషన్‌కు ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
విష్ణు ప్రియ కూడా ఎలిమినేషన్‌కు రిస్క్‌లో ఉందని భావించినా, ఎక్కువగా రోహిణి వైపు అభిప్రాయాలు వస్తున్నాయి. ఇప్పుడు టాప్ 5లోకి ఎవరు చేరుతారనే ఉత్కంఠతో ప్రతి ఒక్కరూ ఫైనల్ నామినేషన్లపై దృష్టి పెట్టారు. ఇక ఈ వారం ఎవరు హౌస్ నుంచి వెళ్లబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది
ALSO READ: Bigg Boss 8 Telugu లో టేస్టీ తేజ ఎంత సంపాదించాడో తెలుసా?