
Bigg Boss 8 Telugu Elimination:
బిగ్ బాస్ 8 తెలుగు సీజన్ ఇప్పుడు అత్యంత పోటీభరితంగా మారింది. ఈ వారం మరో సారిగా ప్రముఖ సెలబ్రిటీలు ఎలిమినేషన్ ప్రమాదంలో ఉన్నారు. గత వారం నామినేషన్‌లో ఉన్నప్పటికీ, అభిమానులు ఎక్కువగా ఊహించిన నైనీ కాకుండా మెహబూబ్ ఎలిమినేట్ కావడంతో సర్వత్రా చర్చ జరిగింది. అయితే, ఈ వారం నామినేషన్‌లో ఉన్న ఆరుగురులో అందరూ డేంజర్ జోన్‌లో ఉన్నట్లు చెబుతున్నారు.
ఈ వారం నామినేషన్‌లో ఉన్న ఆరుగురిలో నైనీ మళ్లీ డేంజర్ జోన్‌లోకి వచ్చారు. అందరూ ఊహించినట్లుగా ఆమెకు తక్కువ ఓట్లు వచ్చాయి, అందువల్ల ఈ వారం కూడా ఎలిమినేషన్ కోసం ఆమె పేరు తెరపైకి వచ్చింది. అయితే గంగవ్వ ఆరోగ్య సమస్యల కారణంగా షో నుండి బయటకు వెళ్ళే అవకాశముందని కూడా సమాచారం.
అదే సమయంలో, కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఎక్కువ ప్రభావం చూపడం లేదని.. కొందరు డేంజర్ జోన్‌లో ఉన్నారని తెలుస్తోంది. వీరి ప్రదర్శన బలంగా లేకపోవడం వల్ల, ప్రేక్షకుల్లో కలిగిన ఆసక్తి కూడా కొంత తగ్గింది. ఇదే సమయంలో, హోస్ట్ నాగార్జున షోను నడిపిస్తున్న తీరు గురించి కొందరు విమర్శలు చేస్తున్నారు. నాగార్జున హౌస్ మేట్స్ విషయంలో పార్షియాలిటీ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ: Red Book 3వ చాప్టర్ రహస్యాలు విడుదలకు సిద్ధమవుతున్నాయా?