SSMB29 Heroine locked:
ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్న రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందనున్న ప్రతిష్ఠాత్మక సినిమా SSMB29 గురించి కొత్త అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా ఆఫ్రికన్ అడవులను ఆధారంగా చేసుకుని, ప్రపంచవ్యాప్తంగా సాగే గ్లోబ్‌ట్రోటింగ్ అడ్వెంచర్‌గా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.
ఈ చిత్రానికి సంబంధించిన క్యాస్టింగ్‌పై నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఆసక్తికరమైన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రముఖ న్యూస్ వెబ్ సైట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం, బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న నటి కావడంతో, ఆమెను ఈ పాత్రకు సరిగ్గా సరిపోతుందని రాజమౌళి భావించారని సమాచారం. ప్రియాంక ఇప్పటికే ఈ పాత్ర కోసం ప్రిపరేషన్ మొదలుపెట్టినట్లు సమాచారం.
View this post on Instagram
ప్రథ్వీరాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో విలన్ పాత్రలో కనిపించనున్నారు. అంతేకాదు, మహేష్ బాబు పాత్రలో అంజనేయస్వామి లక్షణాలు ఉంటాయని సమాచారం. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ బిగ్ బడ్జెట్ సినిమాను దుర్గ ఆర్ట్స్ బ్యానర్‌పై కెఎల్ నారాయణ నిర్మిస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ 2025 ఏప్రిల్‌లో ప్రారంభం కానుంది. అయితే కథ, ఇతర నటీనటుల వివరాలపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. రాజమౌళి ఈ సినిమాతో కూడా రికార్డులు బద్దలు కొడతారు అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ALSO READ: Game Changer సినిమాలో ఒక్క రోజు షూటింగ్ కోసం ఇంత ఖర్చు అయ్యిందా?