HomeTelugu TrendingKalki 2898 AD సినిమా కోసం హీరోయిన్ నాలుగు రోజులు షూటింగ్.. కానీ కనిపించింది 10 సెకండ్లే

Kalki 2898 AD సినిమా కోసం హీరోయిన్ నాలుగు రోజులు షూటింగ్.. కానీ కనిపించింది 10 సెకండ్లే

This actress did 4 days shoot for Kalki 2898 AD but appeared for 10 seconds
This actress did 4 days shoot for Kalki 2898 AD but appeared for 10 seconds

Kalki 2898 AD Cameos:

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రేక్షకులు ముందుకి వచ్చిన Kalki 2898 AD సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్యాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన ఈ సినిమా భారీ స్థాయిలో సక్సెస్ అందుకుంది. విడుదలై వారాలు గడిచినా కలెక్షన్లు మాత్రం తగ్గలేదు. ప్రభాస్ కెరియర్ లో మర్చిపోలేని బ్లాక్ బస్టర్ ఇచ్చిన సినిమా ఇది.

స్టార్ కాస్ట్ తో భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించారు. బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకొనే ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో కనిపించింది. లోక నాయకుడు కమల్ హాసన్ ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించారు. అంతేకాకుండా ఈ సినిమాలో చాలామంది స్టార్ నటీనటులు కీలక పాత్రలు పోషించారు.

ఇవన్నీ కాకుండా సినిమాలో చాలామంది సెలబ్రిటీలు కామియో పాత్రలలో కనిపించారు. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రాజేంద్రప్రసాద్, శోభన, స్టార్ డైరెక్టర్ రాజమౌళి, డైరెక్టర్ అనుదీప్, డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, మాళవిక నాయర్.. ఇలా చాలామంది ఈ సినిమాలో క్యామియో పాత్రలలో కనిపించారు. అయితే ఫస్ట్ హాఫ్ లో ఒక పాటలో ఫరియా అబ్దుల్లా కూడా కనిపించింది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఫరియా కల్కి సినిమా కోసం నాలుగు రోజులు షూటింగ్ చేసినట్లు చెప్పుకొచ్చింది. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే సినిమాలో ఆమె పాత్ర కనిపించేది కేవలం 10 సెకండ్లు మాత్రమే. మరి పది సెకండ్ల రోల్ కోసం నాలుగు రోజులు షూటింగ్ చేయాల్సిన అవసరం ఏముంటుంది.

Read More: Kalki2898AD Review: నాగ్ అశ్విన్ సృష్టించిన సరికొత్త ప్రపంచం ఎలా ఉంది?

అయితే తాజా సమాచారం ప్రకారం ఫరియాకి కొంచెం ఎక్కువ పాత్రే ఉందట. పాపం నాలుగు రోజుల ఆమెతో షూటింగ్ చేయించాక.. ఎడిటింగ్ తర్వాత ఆమెకి కేవలం 10 సెకండ్ల రోల్ మాత్రమే దక్కింది. దీంతో నాలుగు రోజులు పని చేయించుకుని మరీ 10 సెకండ్లు మాత్రమే నిడివి ఇవ్వడం ఏంటి.. అంటూ ఫ్యాన్స్ నాగ్ అశ్విన్ ని ప్రశ్నిస్తున్నారు

Recent Articles English

Gallery

Recent Articles Telugu