బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగన రనౌత్ తో పాటు ఆమె సోదరి రంగోలీ చాందల్‌కు ముంబై పోలీసులు ఈ రోజు సమన్లు పంపారు. ఉద్రిక్తతలు పెంచేలా మత సంబంధిత అంశాలపై సోషల్ మీడియాలో వారిద్దరు చేసిన కామెంట్స్‌పై ఈ నోటీసులు పంపారు. నవంబరు 23న కంగన రనౌత్, నవంబరు 24న రంగోలీ బంద్రా పోలీసు స్టేషన్లో తమ ముందు హాజరై వాటిపై సమాధానం చెప్పాలని పోలీసులు ఆదేశించారు.
కాగా కంగన, రంగోలీకి ముంబై పోలీసులు నోటీసులు పంపడం ఇది మూడోసారి. అక్టోబరు 26, 27 తేదీల్లో ఓసారి, నవంబరు 9, 10 తేదీల్లో మరోసారి తమ ముందు హాజరుకావాలంటూ పోలీసులు వారిని ఆదేశించగా వారు హాజరుకాలేదు. తాను బిజీగా ఉన్నానని, తమ కుటుంబంలోని ఒకరి పెళ్లి ఉందని తెలిపింది కంగన.