మాస్ మహారాజా రవితేజ తన తరువాత సినిమాను విఐ ఆనంద్ డైరెక్షన్లో చేస్తున్న సంగతి తెల్సిందే. ఈ చిత్రానికి ‘డిస్కో రాజా’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఇదొక సైన్స్ ఫిక్షన్ సినిమా. ఈ చిత్రంలో రవితేజకు జోడీగా ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. ఇప్పటికే నాభ నటేష్, పాయల్ రాజ్ పుత్ ఫైనల్ అయ్యారు. చిత్రీకరణలో కూడా పాల్గొంటున్నారు. ఇక మూడవ హీరోయిన్‌గా తాన్యా హోప్ ఎంపికైంది. ఇందులో ఆమె పాత్ర కొంచెం బోల్డ్ అని, గ్లామర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత రామ్ తళ్ళూరి ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు.