HomeOTTKalki 2898 AD OTT: ప్రభాస్ సినిమా నుండి ఈ సీన్స్ కట్ చేసేశారా?

Kalki 2898 AD OTT: ప్రభాస్ సినిమా నుండి ఈ సీన్స్ కట్ చేసేశారా?

These scenes got trimmed from Kalki 2898 AD OTT?
These scenes got trimmed from Kalki 2898 AD OTT?

Kalki 2898 AD OTT Deleted Scenes:

ప్రభాస్‌ నటించిన భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా చిత్రం కల్కి 2898 AD థియేటర్లలో జూన్ 27, 2024న విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లలో కూడా అందుబాటులోకి వచ్చేసింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్‌లో విభిన్న భాషల్లో స్ట్రీమ్ అవుతోంది.

 

ఇందులో నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా కేవలం హిందీ వర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో కూడా చూసేందుకు వీలుగా ఉంది. ఆసక్తికరంగా, థియేటర్లలో 3 గంటల 1 నిమిషం నిడివితో విడుదలైన ఈ చిత్రం, OTT వర్షన్‌లో 6 నిమిషాలు కుదించారు. ఇప్పుడు ఈ చిత్రం 2 గంటల 55 నిమిషాల నిడివితో అందుబాటులో ఉంది.

 

ఈ 6 నిమిషాల ఏమేమి సీన్స్ కట్ అయ్యాయో చూద్దాం..

 

1. ప్రభాస్ ఇంట్రో సన్నివేశాన్ని కొద్దిగా కుదించారు.

2. ఓ వృద్ధ మహిళ ప్రభాస్‌ని కప్ప అని పిలిచే సీన్ సహా మరికొన్ని సంబంధిత సన్నివేశాలను తొలగించారు.

3. ప్రభాస్, ఇద్దరు బరువైన వ్యక్తులతో పోరాడే సన్నివేశాన్ని కూడా తగ్గించారు.

4. ‘త తక్కరా’ పాటలో కొన్ని బీచ్ సన్నివేశాలను తొలగించి, కోలనీ సెక్యూరిటీ ప్రభాస్ ను పంపేసే సీన్ కట్ చేశారు.

5. ఇంటర్వల్ సీన్ లో దీపికా పదుకొనే అగ్నిగుండంలో నడుచుకుంటూ వెళ్లే సన్నివేశానికి కొత్త మ్యూజిక్ జోడించి, ఇంటర్వల్ కార్డ్‌ను పూర్తిగా తొలగించారు.

6. చిన్న చిన్న డబ్బింగ్ మార్పులు కూడా చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu