OTT: ఈవారం (మార్చి 4) నుంచే ఓటీటీల్లోకి కొత్త సినిమాలు వచ్చేస్తున్నాయి. శనివారం (మార్చి 9) వరకూ సుమారు ఆరేడు సినిమాలు డిజిటల్ ప్రీమియర్స్ కు రెడీ అవుతున్నాయి. ఈ వారం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న మూవీ హనుమాన్ ఓటీటీలో విడుదల కానుంది. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈసినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా.. సుమారు రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తోంది. వీటితో పాటు లాల్ సలామ్, యాత్ర-2 తదితర సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో ఏ సినిమా ఏ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందో ఒకసారి చూద్దాం.
బ్యాచిలర్ పార్టీ (కన్నడ మూవీ) – ప్రైమ్ వీడియో (మార్చి 4)
కామెడీ-అడ్వెంచర్ కన్నడ మూవీ బ్యాచిలర్ పార్టీ. అభిజిత్ మహేష్ డైరెక్ట్ వచ్చిన ఈ సినిమాను ప్రముఖ కన్నడ నటుడు రక్షిత్ శెట్టి నిర్మించాడు. జనవరి 26న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈసినిమా సోమవారం (మార్చి 4) నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.
హనుమాన్(తెలుగు) – జీ5 (మార్చి 8)
తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో వచ్చిన సినిమా హనుమాన్. సంక్రాంతికి రిలీజై సంచలన విజయం సాధించింది. ఈ సినిమా (మార్చి 8) మహా శివరాత్రినాడు ఓటీటీలోకి వచ్చేస్తోంది. జీ5 ఓటీటీ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.300 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించిన విషయం తెలిసిందే.
అన్వేషిప్పిన్ కండెతుమ్ – నెట్‌ఫ్లిక్స్ (మార్చి 8)
మలయాళంలో ఈ ఏడాది తొలి హిట్ అందుకున్న మూవీ అన్వేషిప్పిన్ కండెతుమ్. టొవినో థామస్ నటించిన ఈ మర్డర్ మిస్టరీ మూవీ మార్చి 8 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతోపాటు తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లోనూ మూవీ రానుంది.
లాల్ సలామ్ – నెట్‌ఫ్లిక్స్ (మార్చి 8)
సూపర్ స్టార్ రజనీకాంత్ అతిథిపాత్రలో కనిపించిన ఈ లాల్ సలామ్ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ఫిబ్రవరి 9న రిలీజైన ఈ మూవీ నెలలోపే నెట్‌ఫ్లిక్స్ లో అడుగుపెడుతోంది.
యాత్ర 2 – ప్రైమ్ వీడియో (మార్చి 8)
యాత్ర 2 మూవీ ఫిబ్రవరి 8న థియేటర్లలో రిలీజ్ కాగా.. సరిగ్గా నెల రోజులకు ఓటీటీలోకి వస్తోంది. మాజీ సీఎం వైఎస్ చనిపోయిన తర్వాత ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి సీఎం కుర్చీని ఎక్కిన తీరును ఈ మూవీలో చూపించారు. 2019లో వచ్చిన యాత్రకు ఇది సీక్వెల్.
లవర్(తమిళం)- (డిస్నీ ప్లస్ హాట్‌స్టార్)
మెర్రీ క్రిస్మస్ (నెట్‌ఫ్లిక్స్)లాంటి సినిమాలు కూడా ఓటీటీల్లోకి అడుగుపెడుతున్నాయి.