Actors in line for 2024 National Award:
ఈ సారి ఉత్తమ నటుడి అవార్డు రేస్ చాలా హాట్ టాపిక్‌గా మారింది. అల్లు అర్జున్, పృథ్వీరాజ్, చియాన్ విక్రమ్, విజయ్ సేతుపతి — ఈ నలుగురు ప్రదర్శనలతో అందరినీ ఆకట్టుకున్నారు.
అల్లు అర్జున్ గురించి ముందుగా చెప్పుకోవాలి. “పుష్ప 2″తో మరోసారి తన టాలెంట్ చాటిచెప్పాడు. “పుష్ప: ది రూల్” బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది. ముఖ్యంగా హిందీ డబ్బింగ్‌లో ఈ సినిమా 600 కోట్లను దాటేసి అల్లు అర్జున్ కెరీర్‌ను మరింత పైకి తీసుకెళ్లింది. ఇప్పటికే “పుష్ప: ది రైజ్”కు అవార్డు గెలుచుకున్న అల్లు, మరోసారి చరిత్ర సృష్టిస్తాడేమో చూడాలి.
View this post on Instagram
ఇక పృథ్వీరాజ్ “ఆడుజీవితం”లో నజీబ్ పాత్రలో అసాధారణమైన ప్రదర్శన ఇచ్చాడు. ఈ పాత్ర కోసం ఆయన 31 కిలోలు తగ్గడం ఒక సాహసమే. గల్ఫ్ కష్టాల నేపథ్యంలో నజీబ్ జీవితం హృదయాన్ని తాకేలా ఉంటుంది. పృథ్వీరాజ్ నటనను చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు.
View this post on Instagram
చియాన్ విక్రమ్ కూడా రేసులో ఉంది. “తంగలాన్” చిత్రంలో గిరిజన నాయకుడి పాత్రలో విక్రమ్ తన విశేష నటనను చూపించాడు. బాక్సాఫీస్‌లో సినిమాకు పెద్ద విజయం దక్కకపోయినా, విక్రమ్ నటనకు మాత్రం ప్రశంసలు అందాయి.
View this post on Instagram
ఇక విజయ్ సేతుపతి “మహారాజా”లో మరో మాస్టర్ పీస్ ఇచ్చాడు. సేతుపతి నటనలో హాస్యం, భావోద్వేగం, అంతర్లీన మిస్టరీ అన్నీ మిళితమై ఉన్నాయి. ఈ సినిమా విజయంతో ఆయన తమిళనాట మాత్రమే కాకుండా ఇతర భాషల్లోనూ అభిమానులను సంపాదించాడు.
View this post on Instagram
మరి ఎవరు గెలుస్తారు? ప్రతి నటుడు ఈ అవార్డు రేసులో తమదైన ముద్ర వేసారు. మరి ఈసారి ఎవరు ఉత్తమ నటుడు అవార్డును గెలుచుకుంటారో వేచి చూడాలి.
ALSO READ: ఓటిటి లోకి వచ్చేసిన Zebra.. కానీ ట్విస్ట్ ఏంటంటే!