HomeTelugu Big Storiesది వ్యాక్సిన్‌ వార్‌: హిందీ ట్రైలర్‌ విడుదల

ది వ్యాక్సిన్‌ వార్‌: హిందీ ట్రైలర్‌ విడుదల

The Vaccine War Hindi Trail
వివేక్ అగ్ని హోత్రీ డైరెక్షన్‌లో వస్తున్న తాజా చిత్రం ‘ది వ్యాక్సిన్ వార్’. కరోనా మహమ్మారి ఎంతటి విధ్వంసం సృష్టించిందో తెలిసిన విషయమే. లక్షల మంది చనిపోయారు. అయితే ఎట్టకేలకు చివరకు వ్యాక్సిన్​ను అభివృద్ధి చేసి ఈ మారణహోమాన్ని ఆపారు. అయితే ఈ కోవాక్సిన్ అభివృద్ధిపై ట్రూ స్టోరీని చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు అగ్నిహోత్రి. మెడికల్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. భారతదేశంలోనే మొట్టమొదటి బయో సైన్స్ చిత్రం ఇదే కావడం విశేషం. ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి.

అయితే ఇప్పుడు ‘ది వ్యాక్సిన్ వార్’ ప్రమోషన్స్ ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్​ను విడుదల చేసింది చిత్రబృందం. హిందీ వెర్షన్ ట్రైలర్​ను రిలీజ్ చేసింది. కొవిడ్-19 వ్యాక్సిన్‌ను తయారు చేసేందుకు భారతీయ వైజ్ఞానిక సంఘం చేసిన త్యాగాలు, వారు ఎదుర్కొన్న సవాళ్లు, సమస్యలు, చివరికి ఎలా విజయం సాధించారు? వంటి సన్నివేశాలతో ట్రైలర్​ను కట్​ చేశారు. ఈ వ్యాక్సిన్‌ అభివృద్ధి వెనక భారతీయ మెడికల్ సైంటిస్ట్​లు చేసిన కృషిని తెలియజేసేందుకు ప్రయత్నించారు.

ముందుగా భారతీయ సైంటిస్టుల దగ్గర రీసెర్చ్ కోసం కనీసం రూ.1 లక్ష కూడా లేవంటా కదా అని నానా పటేకర్ చెప్పే డైలాగ్​తో ప్రారంభమైన ఈ ప్రచార చిత్రంలో.. సరైన వనరులు, పెట్టుబడి లేకపోయినా కూడా మన భారతీయ సైంటిస్టులు కొవిడ్ వ్యాక్సిన్ కనుక్కోవాలని బలంగా ఎలా నిర్ణయించుకున్నారు, అందుకు తగినట్టుగా ఎలా ముందుకు సాగారు? ఆ సమయంలో వారు మీడియా, ప్రజల నుంచి ఎదుర్కొన్న విమర్శలు వంటివి కూడా చూపించారు. ఈ పరిశోధనల్లో.. కేవలం మగవారు మాత్రమే కాదు.. ఆడవారు కూడా ఎంత కష్టపడ్డారో బాగా చూపించారు. ఈ సినిమాలో అనుపమ్ ఖేర్, నానా పటేకర్, సప్తమి గౌడ, పల్లవి జోషి ప్రధాన పాత్రల్లో నటించారు. ఐ యామ్ బుద్ధ ప్రొడక్షన్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ కలిసి సంయుక్తంగా సినిమాను నిర్మించాయి. పల్లవి జోషి నిర్మాతగా వ్యవహరించారు. సెప్టెంబర్ 28న ఈ చిత్రం హిందీతో పాటు ఇతర భాషల్లో రిలీజ్ కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu