ఆంధ్రప్రదేశ్ రాజధాని పై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ‘జగన్ రెడ్డి’ అరాచకానికి అడ్డుకట్ట పడింది. పైగా ఆ తీర్పులోనే పిటిషనర్లకు 50 వేల రూపాయలు పెనాలిటీ కూడా విధించింది కోర్టు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ తో జగన్ రెడ్డి ప్రభుత్వం కేసును ఉపసంహరించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అది జరిగిపోయింది కూడా. అయినా నేటికీ జగన్ రెడ్డి బుద్ధి మాత్రం మారడం లేదు అంటే.. అది జగన్ రెడ్డికి ఉన్న పైత్యం. ఓ పక్క జగన్ రెడ్డి ప్రభుత్వం కేసును కనుక ఉపసంహరించుకొని పక్షంలో.. తన ప్రభుత్వమే పడిపోయే పరిస్థితి వస్తోందనే స్థితిలో కూడా… మన మూడు ముక్కల ముఖ్యమంత్రిలో చలనం లేదు అంటే.. అతన్ని సైకో అని కాకుండా మరోలా ఎలా భావించగలం ?.
వాస్తవానికి రాజ్యాంగంలోని 142వ అధికరణ క్రింద ఇప్పటివరకు రైతులకు ప్రభుత్వానికి జరిగిన అగ్రిమెంట్లో రైతులకు జరిగిన నష్టాన్ని పరిగణలోకి తీసుకోవాలి. పైగా రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన వారికి కొన్ని బాధ్యతలు ఉంటాయి. వాటిల్లో ప్రధానంగా.. ప్రజలకు ఎటువంటి నష్టం చేయకుండా ప్రజా ప్రయోజనాల కోసమే పాటు పడతాము అని, తాము చేసే ప్రతి పని చట్టబద్ధంగానే చేస్తాము అని, అసలు చట్టానికి వ్యతిరేకంగా ఎలాంటి పని చేయము అని ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి, మంత్రులు, శాసనసభ్యులు.. ఇలా ఎవరైనా సరే.. వారంతా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తే.. వారు తమ అధికారాలను కూడా పోగొట్టుకోవాల్సి ఉంటుంది.
అది ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అయినా, లేక జగన్ రెడ్డి కూలీ మంత్రులు అయినా సరే.. ఎవరైనా సరే.. వీరంతా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారు కాబట్టి, వారందరిని రాబోయే ఎన్నికలలో డిస్ క్వాలిఫై చేసే అధికారం సుప్రీంకోర్టుకు ఉంది. మరి సుప్రీంకోర్టు ఈ పని చేసైనా పుణ్యం కట్టుకుంటే బాగుండు. అలాగే, రాజధానిపై చట్టానికి వ్యతిరేకంగా ఎవరైతే వ్యవహరించారో వారందరూ ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న వారి ఆస్తుల వివరాలలో ఉన్న ఆస్తులన్నింటినీ సీజ్ చేసి, వారి వద్ద నుంచి నష్టపరిహారం రికవరీ చేసే పరిస్థితులు కూడా ఉన్నాయి. నిజంగా ఇది గానీ జరిగితే.. ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన సకల దరిద్రాలు అన్నీ ఒక్క తీర్పుతో పోతాయి.
నిజానికి శివరామకృష్ణన్ కమిటీ రిపోర్ట్ పై జగన్ రెడ్డి ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి రాజధానిగా అమరావతి పై తీర్పును ఆలస్యం అయ్యేలా చేస్తూ.. తమ నీచత్వాన్ని కొనసాగిస్తూ వస్తోంది. జగన్ రెడ్డి ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలతో చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడింది అని, వాటన్నిటిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ అమరావతి రైతులు కూడా మరో పిటిషన్ సుప్రీంకోర్టులో వేస్తే.. జగన్ రెడ్డి పరిస్థితి ఏమిటి ?, ప్రస్తుతం అమరావతి రైతులు ఆ పనిలోనే ఉన్నారు. ఇదే విషయాన్ని ప్రముఖ హైకోర్టు సీనియర్ న్యాయవాది వలేటి లక్ష్మీనారాయణ స్పష్టం కూడా చేశారు. ఈ పిటిషన్ తోనైనా జగన్ రెడ్డి పీడ వదలాలని ఆశిద్దాం.