HomeTelugu Trendingఅనుష్క సంచలన నిర్ణయం.. ఇక పై వాటికి దూరం

అనుష్క సంచలన నిర్ణయం.. ఇక పై వాటికి దూరం

The news of anushka shetty

టాలీవుడ్‌ బ్యూటీ అనుష్క పై తరచు ఎదో ఒక ఆసక్తికర వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూనే ఉంటుంది. తాజా ఈ జేజమ్మకు సంబంధించిన ఓ వార్త చక్కర్లు కొడుతోంది.స్వీటీ త్వరలో సినిమాలకు గుడ్‌బై చెప్పబోతుంది అని రూమర్స్‌ వినిపిస్తున్నాయి. ఇకపై అనుష్క సినిమాలకు దూరం కావాలి అని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తన సన్నిహితుల వద్ద ఆమె ప్రస్తావించినట్లు వినికిడి.

టాలీవుడ్‌లో నాగార్జున ‘సూపర్‌’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తరువాత తెలుగు, తమిళంలో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించింది. అంతేకాదు లేడీ ఓరియెండెట్ మూవీలతో మెప్పించింది. తాజాగా అనుష్క నటించిన నిశ్శబ్దం చిత్రం విడుదల సిద్ధంగా ఉంది. కరోనా కారణంగా ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేయలా..? లేదా థియేటర్లలో విడుదల చేయాలన్న అన్న ఆలోచనలో ఉన్నారు దర్శక నిర్మాతలు. ఇక ఈ మూవీ తరువాత అనుష్క మరే చిత్రానికి ఓకే చెప్పలేదు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఆ మధ్యన ఓ మూవీకి అనుష్క ఓకే చెప్పినా.. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ సినిమా వాయిదా పడిందట. కోలీవుడ్ సమాచారం ప్రకారం ఈ మూవీ ఇప్పట్లో ఉండకపోవచ్చని తెలుస్తోంది‌. మరోవైపు అనుష్కకు పెళ్లి చేయాలన్న ఆలోచనలో ఆమె కుటుంబ సభ్యులు ఉన్నారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకునే అనుష్క సినిమాలకు దూరం అవుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తలపై అనుష్క ఎలా స్పందింస్తుందో చూడాలి.

The news of anushka shetty 1 1

Recent Articles English

Gallery

Recent Articles Telugu