‘మా నాన్న ఒకసారి చెప్పారు. సూర్య కిరణాలు పడే చోటంతా రక్షించాలని.. నేను సింబా ముఫాసా కొడుకుని’ అంటున్నారు నాని. ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ వాల్ డిస్నీ పిక్చర్స్ నిర్మిస్తున్న అద్భుత యానిమేషన్ చిత్రం ‘ది లయన్ కింగ్’. 1994లో విడుదలైన కార్టూన్ యానిమేషన్ చిత్రాన్ని ఇప్పుడు సరికొత్త హంగులతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. జులై 19న తెలుగులోనూ ఈ సినిమా విడుదల కానుంది. ఇందులోని పాత్రలకు తెలుగు నటులు నాని(సింబా),
రవిశంకర్(ముఫాసా), జగపతిబాబు(స్కార్), అలీ(టిమోన్), బ్రహ్మానందం(పుంబా)లు డబ్బింగ్ చెప్పడం విశేషం. ఇటీవల విడుదల చేసిన తెలుగు టీజర్‌కు విశేష స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, అందులో నాని వాయిస్ లేకపోవడంతో అభిమానులందరూ కాస్త నిరాశ పడ్డారు. ఇప్పుడు నాని డైలాగ్‌తో వచ్చిన ఈ టీజర్ ఆకట్టుకుంటోంది. సింబా నాని వాయిస్‌లో డైలాగ్‌లు చెబుతుంటే ఎలా ఉంటుందో చూడాలని ప్రేక్షకులు ఆత్రుతుగా ఎదురుచూస్తున్నారు.