సూపర్ స్టార్ మహేష్‌బాబు ‘the HUMBL co’ పేరుతో తన సొంత బ్రాండ్‌ను స్థాపించారు. ఇటీవల మహేష్ టీం http://www.spoyl.in/mahesh-babu అనే లింక్‌ను షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఫ్యాన్స్ లాగిన్ ద్వారా మహేష్ ఫొటో, పక్కనే ఉన్న బ్రాండ్ పేరు రివీల్ అవుతూ వచ్చాయి. కాగా ఇప్పుడు బ్రాండ్ పేరు పూర్తిగా బహిర్గతం అయ్యింది. ఈ నేపథ్యంలో మహేష్ ట్వీట్ చేశారు. ‘ఇవాళ మా HUMBL రివీల్ అయ్యింది. మీ అద్భుతమైన స్పందనకు ధన్యవాదాలు. మా పరంగా The HUMBL Co అనేది కేవలం ఓ క్లాథింగ్ మాత్రమే కాదు.. అది జీవనశైలి. ఈ ఫ్యామిలీలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. ఆగస్టు 7న The HUMBL Co ప్రారంభం కాబోతోంది’ అని ఆయన ట్వీట్ చేశారు.
మహేష్ ప్రస్తుతం ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. రష్మిక హీరోయిన్. ఇటీవల ఈ మూవీ కశ్మీర్ షెడ్యూల్ పూర్తయింది. మహేష్‌బాబు ఇందులో మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో కనిపించనున్నారు. మరోపక్క ఈ సినిమా స్టిల్స్ లీక్ అయ్యాయి, ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి.
Our Humbl endeavour unveils today. Thank you all for the astounding response 🤗🤗 For us, The Humbl Co. is not just clothing, it’s a way of life. We welcome you all to the @thehumblco family. Stay tuned for the launch on 7th August! #theHUMBLco pic.twitter.com/eLAR13jBgt
— Mahesh Babu (@urstrulyMahesh) July 29, 2019