సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమాలు చేయాలని టాలీవుడ్ లో దర్శక నిర్మాతలు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. డిఫరెంట్ కాన్సెప్ట్, ప్రయోగాలు చేయడానికి మహేష్ బాబు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. అందుకే ఆయన చేసిన సినిమాలే ఉదాహరణ. టాలీవుడ్ నుంచే కాకుండా కోలీవుడ్ దర్శకులు సైతం మహేష్ తో సినిమా చేయడానికి ఇష్టపడుతుంటారు.
తాజాగా సుచిత్ర రావు హైవే మాఫియా అనే బుక్‌ను విడుదల చేసింది. హైవే లో జరుగుతున్న మాఫియా గురించిన కథతో వచ్చిన పుస్తకం ఇది. ఈ పుస్తకం ఆధారంగా సినిమా చేయాలని, అందులో మహేష్ బాబు హీరోగా చేయాలని అంటోంది సుచిత్ర. తెలుగులో మహేష్, తమిళంలో విజయ్, కన్నడంలో కేజీఎఫ్ హీరో యాష్ నటిస్తే బాగుంటుందని అంటోంది ఈ యువ రచయిత్రి. మరి మహేష్ ఈ కథతో సినిమా చేయడానికి ఒప్పుకుంటాడా. మాఫియా కథలతో సినిమాను డీల్ చేయాలంటే పూరి లాంటి వ్యక్తులకే సాధ్యం అవుతుంది. పూరితో మహేష్ పోకిరి, బిజినెస్ మెన్ సినిమాలు చేశాడు. వీరి కాంబినేషన్లో మరో సినిమాను ఆశించవచ్చేమో. చూద్దాం.