Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పానవసరం లేదు. ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు గాని, ఆయన సాధించుకున్న క్రేజ్ గాని అలాంటిది. ఇప్పటికీ కూడా ఆయన చేస్తున్న వరుస సినిమాలో మంచి దూసుకుపోతున్నారు.
చిరంజీవి కెరీర్ బిగినింగ్ లో సహాజనటిగా పేరు తెచ్చుకున్న జయసుధ ఆయనతో హీరోయిన్ గా నటించింది. వీరి కాంబినేషన్‌లో కథ కాదు, మగధీరుడు లాంటి సూపర్ హిట్స్ ఉన్నాయి. ఆ తర్వాత వీరి కాంబినేషన్ లో పెద్దగా చిత్రాలు రాలేదు.
అయితే 1995లో తెరకెక్కిన రిక్షావోడు చిత్రంలో ఎవరూ ఊహించని విధంగా చిరంజీవికి తల్లిగా జయసుధ నటించింది. ఈ సినిమాలో నగ్మా, సౌందర్య హీరోయిన్‌లుగా నటించారు. చిరంజీవి ఇందులో తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశాడు.
రిక్షావోడు కథ రెడీ అయ్యాక ఈ చిత్రానికి కోదండ రామిరెడ్డి డైరెక్టర్ గా అనుకున్నారు. కానీ ఆయన బిజీగా ఉండడం వల్ల కుదర్లేదు. దీనితో కోడి రామకృష్ణని తీసుకున్నారు. ఇదే ఈ సినిమాకి మొదటి మైనస్. ఆ కథకి కోడి రామకృష్ణ కరెక్ట్ కాదు అన్నట్లుగా అభిప్రాయాలు కూడా వచ్చాయంట.
కాగా ఈ సినిమాలో చిరంజీవికి తల్లిగా ఒక హీరోయిన్ నటించాలి. దానికోసం జయసుధని సంప్రాదించారట. మొదట మదర్ రోల్ అనగానే ఆమె ఒప్పుకోలేదు. కుదరదు అని చెప్పిందట. 15 లక్షలు రెమ్యునరేషన్.. 5 రోజులు షూటింగ్‌కు ఒప్పించరట.
అయితే ఈ సినిమా కోసం ఆమెకు పెద్ద మొత్తం ఇచ్చి.. పెద్ద కాస్టింగ్ తో ఆ చిత్రం చేసినప్పటికీ అది విజయం సాధించలేదు. ఈ సినిమా భారీ అంచనాలతో వచ్చి డిజాస్టర్ గా మిగిలింది.
ఈ సినిమా ప్లాప్ అవ్వడానికి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వచ్చే సీన్స్ మైనస్ అయిందట. ఆ సీన్స్ ఏవీ కూడా సినిమాను పెద్దగా ఎంగేజింగ్ గా తీసుకెళ్లలేకపోయాయి. దానివల్ల ఈ సినిమా అనేది అంత ఇంపాక్ట్ ను క్రియేట్ చేయలేకపోయింది అని అంటున్నారు.