HomeTelugu Trendingరష్మిక కొత్త సినిమా లాంఛ్‌ చేసిన అల్లు అరవింద్‌

రష్మిక కొత్త సినిమా లాంఛ్‌ చేసిన అల్లు అరవింద్‌

the girlfriend pooja ceremoరాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న తాజా చిత్రం ‘ది గ‌ర్ల్‌ఫ్రెండ్‌’. నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న ఈ సినిమాలో ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తుంది. ఈ ప్రాజెక్ట్ మంగ‌ళ‌వారం అఫీషియ‌ల్‌గా లాంఛ్ అయ్యింది. ఈ వేడుకకు అల్లు అర‌వింద్ ముఖ్య అతిథిగా వచ్చి దర్శకుడికి స్క్రిప్ట్ అందజేశారు.

‘ది గర్ల్‌ఫ్రెండ్’ రష్మిక మందన్న 24వ సినిమా. ఇక ఈ ఈ కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్, ఎస్కేఎన్, దర్శకులు సాయి రాజేష్, మారుతి, పవన్ సాదినేని, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. విద్య కొప్పినేని, ధీర‌జ్ మొగిలినేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అల్లు అర‌వింద్ సమర్పకుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు.

కాగా ఈ ఈవెంట్‌కు ర‌ష్మిక రాలేదు. ర‌ష్మిక ప్ర‌స్తుతం యానిమ‌ల్ మూవీ ప్ర‌మోష‌న్స్‌లో బిజీగా ఉంది. ఈ సినిమా డిసెంబ‌ర్ 01న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ర‌ణ్‌బీర్‌క‌పూర్ హీరోగా నటించిన ఈ సినిమాకు సందీప్ వంగా ద‌ర్శ‌క‌త్వం వహించాడు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu